Cricket World Cup 2023: సెమీఫైనల్ మ్యాచ్‌కు ముందు బెంగళూరులో టీం ఇండియా దీపావళి వేడుకలు
టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్‌తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది....

Team India Celebrates Diwali
Cricket World Cup 2023: టీంఇండియా జట్టు శనివారం బెంగళూరులో దీపావళి వేడుకలు జరుపుకుంది. క్రికెట్ వరల్డ్ కప్ 2023లో భాగంగా తమ చివరి లీగ్ గేమ్ నెదర్లాండ్స్‌తో తలపడనున్న భారత క్రికెట్ జట్టు దీపావళి రోజైన ఆిదివారం ఆడనుంది. బెంగుళూరులోని టీమ్ హోటల్‌లో స్క్వాడ్ సభ్యులు, సహాయక సిబ్బంది సన్నిహిత కుటుంబం, స్నేహితులతో కలిసి దీపావళి పండుగ జరుపుకున్నారు. టీం ఇండియా జట్టు సభ్యులు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ దీపావళి పార్టీకి సంబంధించిన ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో నెటిజన్లతో పంచుకున్నారు.
ALSO READ : ICC World Cup : వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ బెర్తులు ఖరారు.. అర్హత సాధించిన ఆ నాలుగు జట్లు
దీపావళి పార్టీలో కుర్తా-పైజామా ధరించి క్రికెటర్లు పాల్గొన్నారు. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండా భారత్ లీగ్ స్టేజ్ టాపర్‌గా నిలిచింది. 2019 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. మరో వైపు రెండో సెమీ ఫైనల్‌లో కోల్‌కతా వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇప్పటి వరకు లీగ్ దశలో భారత్‌దే ఆధిపత్యం. 8 మ్యాచ్‌లలో 8 గెలిచారు.
ALSO READ : ENG vs PAK : 6.4 ఓవర్లలో 338 పరుగులు.. బై బై పాకిస్థాన్.. మీమ్స్ వైరల్
రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాపై విజయంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఒక చిన్న ఛేజింగ్‌లో సింగిల్ డిజిట్‌కు మూడు వికెట్లు పడిపోయిన తర్వాత, విరాట్ కోహ్లి కేఎల్ రాహుల్ జట్టును విజయానికి తీసుకెళ్లారు. అది భారత్‌కు శుభారంభం. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడే ముందు భారత్ ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. దాని తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంకలను టీం ఇండియా ఓడించడంతో ఆధిపత్యం కొనసాగింది.
From us to all of you, Happy Diwali ?❤️ pic.twitter.com/vXA8CiGt7A
— K L Rahul (@klrahul) November 11, 2023