AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !

ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాంపు ఉంటుంది. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ వర్తిస్తుంది.

AISSEE 2024 : అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024).. దరఖాస్తుకు తుదిగడువు ఇదే !

AISSEE 2024

Updated On : November 12, 2023 / 11:23 AM IST

AISSEE 2024 : 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(AISSEE-2024) నోటిఫికేషన్ విడుదలైంది. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను నెలకొల్పింది. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని మొత్తం 33 సైనిక స్కూళ్లలో విద్యార్హులకు సీట్లు కేటాయించేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు.

READ ALSO : వాట్సాప్‌లోనే ఆధార్, పాన్ డౌన్‌లోడ్ చేయొచ్చు!

సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) ఈ పరీక్షను నిర్వహిస్తుంది. అదే క్రమంలో ఎన్‌జీవోలు, ప్రైవేట్ పాఠశాలలు, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 నూతన సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2024 ద్వారానే జరగనున్నాయి.

పరీక్ష వివరాలు…

2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎన్‌ఎన్‌ఈఈ)-2024 పరీక్ష నిర్వహిస్తారు.

సీట్ల కేటాయింపు ;

సీట్ల కేటాయింపుకు సంబంధించి ఆరో తరగతి(ప్రభుత్వ- 290, ప్రైవేటు- 2255) మొత్తం 5225 సీట్లు, తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని _ కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్సీఎస్సార్‌ నెల్లూరు)లోసైనిక పాఠశాలలు ఉన్నాయి.

READ ALSO : Vijayasai Reddy : ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇదంతా చేస్తున్నారు.. పురంధేశ్వరిపై ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి ఫైర్

వయోపరిమితి :

ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలు సైతం ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

9వ తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 18-15 ఏళ్ల మధ్య
ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సబ్జెక్టులో కనిష్టంగా 25% మార్కులు, అన్ని సబ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. పరీక్షలో అర్హత సాధించిన వారికి శారీరక దార్థ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.

READ ALSO : Sitara Ghattamaneni : దీపావళికి ముగ్గులు వేస్తున్న సితార పాప.. క్యూట్ గా దివాళి స్పెషల్ ఫోటోలు..

దరఖాస్తు ఫీజు

ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష ఫీజు చెల్లించాలి.

పరీక్ష తేది ;

జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.

పరీక్ష విధానం

ఓఎంఆర్‌ షీట్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. దీనిలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

6వ తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. మొత్తం 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు కాగా ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.

READ ALSO : Top 5 Cars Buy Diwali Season : దీపావళి సీజన్‌లో టాప్ 5 కొత్త కార్లు ఇవే.. నో వెయిటింగ్ పీరియడ్ భయ్యా.. నచ్చిన కారు కొనేసుకోండి!

9వ తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు , ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష వ్యవధి ఉంటుంది.

పరీక్ష భాష ఎంపిక

9వ తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

దేశ వ్యాప్తంగా 186 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్ లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

READ ALSO : Anand Mahindra : ఆనంద్ మహీంద్రాకి నోరూరించిన బ్రేక్ ఫాస్ట్ మెనూ.. అందులో ఏమున్నాయంటే?

సీట్ల కేటాయింపు వివరాలు ;

ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాంపు ఉంటుంది. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ వర్తిస్తుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయిస్తారు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలుండదు.

దరఖాస్తు విధానం ;

ముందుగా AISSEE 2024 questions.nta.ac.in/AISSEE అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.

అకౌంట్ క్రియేట్ చేసిన తరువాత వివరాలను నమోదు చేసుకోవాలి.

అనంతరం AISSEE 2024 రిజిస్ట్రేషన్ IDతో లాగిన్ అవ్వాలి.

అవసరమైన వివరాలను అందించాలి. అందులో అడిగిన ఫార్మాట్‌లో డాక్యుమెంట్స్ ను అప్‌లోడ్ చేయాలి.

దరఖాస్తు రుసుమును చెల్లించి సబ్ మిట్ చేయాలి.

READ ALSO : Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో బీటెక్ చదువుతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగం…దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

అర్హత కలిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో నవంబర్‌ 7, 2023 నుంచి డిసెంబర్‌ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్‌ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం కల్పించారు.