Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో బీటెక్ చదువుతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగం…దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్ధులను సర్వీస్ సెలక్షన్ బోర్డు అధ్వర్యంలో బెంగుళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో బీటెక్ చదువుతోపాటు లెఫ్టినెంట్ ఉద్యోగం…దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

Indian Army Recruitment 20023

Indian Army Recruitment 2023 : ఇండియన్ ఆర్మీలో బీటెక్ చదువుతోపాటుగా ఆర్మీలో లెఫ్టినెంట్ కొలువు సొంతం చేసుకునే అవకాశం దక్కించుకోవాలనుకునే వారికి మంచి అవకాశం. ఇండియన్ ఆర్మీ 2024 జులైలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 51వ బ్యాచ్ ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 90 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : AI: ఏఐ.. భవిష్యత్తులో మానవ ఉనికినే ప్రమాదంలో పడేస్తుందా?

అర్హతలు ;

జేఈఈ మెయిన్ 2023లో ర్యాంకు సాధించిన అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్ పాసై ఉండాలి. అవివాహిత పురుష అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

వయసు ;

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 16 1/2 సంవత్సరాల నుండి 19 1/2 మధ్య ఉండాలి.

READ ALSO : National Education Day 2023 : జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా ?

ఎంపిక విధానం ;

ఇంటర్ మార్కులు, జేఈఈ మెయిన్స్ స్కోర్ ద్వారా షార్ట్ లిస్ట్ చేస్తారు. ఇందులో ఎంపికైన అభ్యర్ధులను సర్వీస్ సెలక్షన్ బోర్డు అధ్వర్యంలో బెంగుళూరులో అయిదు రోజుల పాటు రెండు దశల్లో సైకలాజికల్ పరీక్షలు, గ్రూప్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

తొలిరోజు స్టేజ్ 1 స్క్రీనింగ్ పరీక్షలో అర్హత సాధించిన వారిని స్టేజ్ 2కు ఎంపిక చేస్తారు. నాలుగు రోజుల పాటు సాగే వివిధ పరీక్షలలో అన్ని విభాగాల్లో అభ్యర్ధులు రాణించాల్సి ఉంటుంది. అలాంటి వారినే తుదకు ఎంపిక చేస్తారు.

READ ALSO : Agniveer Vayu Result 2023 : అగ్నివీర్ వాయు రాతపరీక్ష ఫలితాలను డౌన్ లోడ్ చేయటం ఎలాగంటే ?

శిక్షణ సమయం ;

ఎంపికైన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులో ఏడాది పాటు ఆఫీసర్‌ టైనింగ్‌ అకాడమీ-గయాలో బేసిక్‌ మిలిటరీ టైనింగ్‌ ఉంటుంది. అనంతరం నాలుగేళ్లపాటు టెక్నికల్‌ టైనింగ్‌ పుణె, సికింద్రాబాద్‌, మావ్‌ల్లోని ఆర్మీ కేంద్రాల్లో ఏదో ఒకచోట శిక్షణ ఇస్తారు. ఇందులో రెండు దశలు…ఫేజ్‌-1 మూడేళ్ల ప్రీ కమిషన్‌ టైనింగ్‌, ఫేజ్‌-2 ఏడాది పోస్ట్‌ కమిషన్‌ టైనింగ్‌ ప్రక్రియలు ఉంటాయి.

బీటెక్‌ కోర్సు ;

నాలుగేళ్ల శిక్షణ అనంతరం లెప్టినెంట్‌ హోదా సొంతమవుతుంది. టైనింగ్‌, కోర్సు పూర్తయిన తర్వాత వీరికి ఇంజనీరింగ్‌ (బీటెక్‌) డిగ్రీని జవహర్‌లాల్‌ నెహూ యూనివర్సిటీ అందజేస్తుంది. ఆతరువాత పూర్తిస్థాయిలో విధుల్లోకి తీసుకుంటారు.

READ ALSO : Diwali Bank Holidays : బ్యాంకులకు 6 రోజులపాటు సెలవులు.. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పండుగ సెలవులు

వేతనం ;

లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లో చేరే వారికి లెవల్‌-10 ప్రకారం మూలవేతనం చెల్లిస్తారు. ప్రతి నెల రూ.56,100తో పాటు మిలటరీ సర్వీస్‌ పే కింద రూ.15,500 చెల్లిస్తారు. వీటికి అదనంగా డీఏ, హెచ్‌ఆర్‌ఎ, ఇతర ప్రోత్సాహకాలు ఇస్తారు. విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని కలుపుకుని సీటీసీ రూపంలో నెలకు దాదాపు లక్ష రూపాయాలు పొందవచ్చు.

ప్రమోషన్లు ;

ఈ పోస్టులకు ఎంపికైన వారు తక్కువ వ్యవధిలోనే ప్రమోషన్లతో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. విధుల్లో చేరిన రెండేళ్ల తర్వాత కెప్టెన్‌, ఆరేళ్ల సర్వీస్‌తో మేజర్‌, పదమూదేళ్ల అనుభవంతో లెప్టినెంట్‌ కల్నల్‌ హోదాలను పొందవచ్చు.

READ ALSO : JNTU Anantapur Recruitment 2023 : JNTU అనంతపురంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్‌ 12, 2023 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https : // www.joinindianarmy.nic.in/ పరిశీలించగలరు.