Diwali Bank Holidays : బ్యాంకులకు 6 రోజులపాటు సెలవులు.. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పండుగ సెలవులు

దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులకు ఆరు రోజులపాటు సెలవులు మంజూరు చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ తేదీల వారీగా బ్యాంకు సెలవులు మారాయి. నవంబర్ 10వతేదీ నుంచి 15వతేదీ వరకు ఆరు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.....

Diwali Bank Holidays : బ్యాంకులకు 6 రోజులపాటు సెలవులు.. వివిధ రాష్ట్రాల్లో వేర్వేరు తేదీల్లో పండుగ సెలవులు

Bank

Diwali Bank Holidays : దీపావళి పండుగ సందర్భంగా బ్యాంకులకు ఆరు రోజులపాటు సెలవులు మంజూరు చేస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ రాష్ట్రాల్లో వివిధ తేదీల వారీగా బ్యాంకు సెలవులు మారాయి. నవంబర్ 10వతేదీ నుంచి 15వతేదీ వరకు ఆరు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఈ ఏడాది దీపావళి పండుగ ఉత్సవాలు నవంబర్ 10వతేదీన ధన్‌తేరస్‌తో ప్రారంభమై నవంబర్ 15వతేదీ భాయ్ దూజ్ తో ముగుస్తాయి. దీంతో పలు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో ఆరు రోజుల పాటు బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ALSO READ : Deepavali : దీపావళి సందర్భంగా క్రాకర్‌ టైమ్‌ ఇదే…బాంబే హైకోర్టు సంచలన ఆదేశం

బ్యాంకులకు సెలవులు ప్రకటించినా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు మాత్రం యథావిధిగా పని చేస్తూనే ఉంటాయని బ్యాంకింగ్ అధికారులు చెప్పారు. నవంబర్ 11వతేదీ శనివారం, నవంబర్ 12వతేదీ ఆదివారం బ్యాంకులకు సెలవు. దేశంలోని చాలా నగరాల్లో దీపావళి పండుగ సందర్భంగా 13, 14 తేదీల్లో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భైదూజ్/చిత్రగుప్త్ జయంతి/లక్ష్మీ పూజ (దీపావళి)/నింగోల్ చకౌబా/భ్రాత్రి పండుగల కారణంగా నవంబర్ 15న బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ALSO READ : New COVID Variant : దీపావళి పండుగ సీజన్‌లో జ్వరాలు వస్తే జాగ్రత్త…కొత్త కొవిడ్ జేఎన్1 వేరియంట్ వ్యాప్తి, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

బ్యాంకుల సెలవులు…

నవంబర్ 10 (శుక్రవారం): అగర్తల, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, ఇంఫాల్, కాన్పూర్, లక్నోలో వంగాలా ఫెస్టివల్ కారణంగా బ్యాంకులు మూసివేశారు.
నవంబర్ 11 (శనివారం): భారతదేశంలో అన్ని బ్యాంకులు మూసివేశారు.
నవంబర్ 12 (ఆదివారం): ఆదివారం, దీపావళి సందర్భంగా బ్యాంకులు మూసివేశారు.
నవంబర్ 13 (సోమవారం): గోవర్ధన్ పూజ కోసం త్రిపుర, ఉత్తరాఖండ్, సిక్కిం, మణిపూర్, రాజస్థాన్, యూపీ, మహారాష్ట్రతో సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేయనున్నారు.
నవంబర్ 14 (మంగళవారం): గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, సిక్కింలో దీపావళికి బ్యాంకులు మూసివేయనున్నారు.
నవంబర్ 15 (బుధవారం): భాయ్ దూజ్ పర్వదినం సందర్భంగా సిక్కిం, మణిపూర్, ఉత్తరప్రదేశ్, బెంగాల్, హిమాచల్ ప్రదేశ్‌లలో బ్యాంకులు మూసివేయనున్నారు.

ALSO READ : ఆపిల్ ఐఫోన్ 13పై ఫ్లాట్ డిస్కౌంట్..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం దేశంలో మూడు రకాల బ్యాంక్ సెలవులు: నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద సెలవులు, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడేలు, బ్యాంకుల ఖాతాల ముగింపు సెలవులున్నాయి. మొత్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెలవుల క్యాలెండర్ ప్రకారం నవంబర్‌లో 15 రోజుల పాటు బ్యాంకులు మూసివేయనున్నారు.

ALSO READ : Cyber Alert : ఆన్‌లైన్‌లో దీపావళి షాపింగ్ చేస్తున్నారా? ఈ ఫేక్ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్లతో జాగ్రత్త.. సైబర్ పరిశోధకుల హెచ్చరిక! 

ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు వంటి సాధారణ సెలవులు కూడా ఉంటాయి. ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం, తొమ్మిది సెలవులు పండుగ లేదా గెజిట్. కొన్ని బ్యాంకు సెలవులు ప్రాంతీయంగా ఉంటాయి. రాష్ట్రానికి, బ్యాంకుకు బ్యాంకుకు భిన్నంగా సెలవులు ఉన్నాయని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.