JNTU Anantapur Recruitment 2023 : JNTU అనంతపురంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ ; https://recruitments.universities.ap.gov.in) పరిశీలించాలి.

JNTU Anantapur Recruitment 2023 : JNTU అనంతపురంలో ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే !

JNTU Anantapur Recruitment 2023

JNTU Anantapur Recruitment 2023 : అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTUA)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 189 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : Chandra Mohan : తల్లి చనిపోయినా షూటింగ్ పూర్తిచేసి మరీ వెళ్లిన చంద్ర మోహన్..

పోస్టుల ఖాళీలు ;

ప్రొఫెసర్లు 7 ఖాళీలు

అసోసియేట్ ప్రొఫేసర్లు 23 ఖాళీలు

అసిస్టెంట్ ప్రొఫెసర్లు 159 ఖాళీలు

READ ALSO : Chandra Mohan Family : చంద్ర మోహన్ ఫ్యామిలీ గురించి.. భార్య పెద్ద రచయిత్రి.. పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా?

అర్హతలు ;

ప్రొఫెసర్ పోస్టులకు పీహెచ్ డీ విద్యార్హతగా నిర్ణయించారు. ఎంపికైన వారికి పే స్కేలు రూ. 1,44,200 నుండి 2,18,200 చెల్లిస్తారు.

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ ఉత్తీర్ణు లై ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేలు రూ.1,33,400 నుండి 2,17,100 చెల్లిస్తారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, బీఈ, బీటెక్, బీఎస్ అండ్ ఎంఈ, ఎంటెక్, ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పూర్తి చేసి ఉండాలి. ఎంపికైన వారికి పే స్కేలు రూ.57,700 నుండి 1,82,400 చెల్లిస్తారు.

READ ALSO : National Education Day 2023 : జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11న ఎందుకు జరుపుకుంటున్నారో తెలుసా ?

దరఖాస్తు చేసే విధానం ;

అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ ; https://recruitments.universities.ap.gov.in) పరిశీలించాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రింట్ అవుట్ లను అవసరమైన ఇతర పత్రాలను జతపరిచి రిజిస్టర్ పోస్టు, స్పీడ్ పోస్టు, కొరియర్ ద్వారా జవహర్ లాల్ నెహ్రు టెక్నలాజికల్ యూనివర్శిటీ అనంతపురం, ఆంధ్రప్రదేశ్ 515002కు పంపాల్సి ఉంటుంది.

READ ALSO : Ayodhya Deepotsav : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. సరయూ నదీ తీరంలో 51 ఘాట్ లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ గిన్నిస్ రికార్డు

ఆఫ్ లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది నవంబర్ 20, 2023గా నిర్ణయించారు. ఆన్ లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీలను పంపేందుకు ఆఖరు తేది నవంబర్ 27, 2023గా నిర్ణయించారు.