Rayalaseema University Recruitment : రాయలసీమ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ , మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ , పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటుగా, బోధన, పరిశోధనా అనుభవం కలిగి ఉండాలి.

Rayalaseema University Recruitment : రాయలసీమ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

Rayalaseema University Recruitment

Updated On : May 4, 2023 / 10:14 AM IST

Rayalaseema University Recruitment : కర్నూలు లోని రాయలసీమ యూనివర్శిటీ టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2023-24 సంవత్సరానికి వివిధ విభాగాలు, సబ్జెక్టుల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : NEET Admit Card 2023 : నీట్ యూజీ అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్టిఏ.. డౌన్ లోడ్ చేసుకోవటం ఎలాగంటే ?

సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇంగ్లీష్ , మ్యాథమేటిక్స్, ఫిజిక్స్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత విభాగంలో పీజీ , పీహెచ్ డీ ఉత్తీర్ణతతోపాటుగా, బోధన, పరిశోధనా అనుభవం కలిగి ఉండాలి.

READ ALSO : Betel Leaves Cultivation : తమలపాకు సాగుతో.. లాభాల పంట

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి గేట్ 2023, యూజీసీ నెట్, సీఎస్ఐఆర్ నెట్ 2023 స్కోరు, స్క్రీనింగ్ టెస్ట్, సెమినార్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 24 మే, 2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://rayalaseemauniversity.ac.in/ పరిశీలించగలరు.