Trainee posts in SAIL
SAIL Recruitment : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. బొకారో స్టీల్ ప్లాంట్ లో మొత్తం 85 అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. పోస్టుల కేటాయింపుకు సంబంధించి అన్‌రిజర్వుడ్‌కు 35,ఎస్టీలకు 22,ఎస్సీలకు 10, ఓబీసీలకు 10, ఈడబ్ల్యూఎస్‌లకు 8 కేటాయించారు.
READ ALSO : PGCIL Recruitment : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీ
అర్హతలు ;
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మెట్రిక్యులేషన్ పాసై.. అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ సర్టిఫికెట్ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు లోపు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఈఎస్‌ఎంలకు మూడేళ్లు, సెయిల్ ఉద్యోగులకు పదేళ్ల వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
READ ALSO : JEE Main 2024 : జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం
దరఖాస్తు చేసుకునే పురుష అభ్యర్థుల ఎత్తు 155 సెం.మీ., బరువు 45 కేజీలు ఉండాలి. ఛాతీ 75 సెం.మీ. ఉండి, గాలి పీల్చినప్పుడు 79 సెం.మీ. వరకూ ఉండాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 143 సెం.మీ. ఉండి, బరువు 35 కేజీలు ఉండాలి. అభ్యర్థులకు కంటి చూపు లోపాలు ఉండరాదు. అప్లికేషన్ ఫీజుకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు రూ.100. చెల్లించాల్సి ఉంటుంది.
READ ALSO : kidney Stone : కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !
ఎంపిక విధానం ;
అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించినవారిని స్కిల్/ ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేయబడతారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల శిక్షణ, ఏడాది ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది.
మొదటి ఏడాది శిక్షణ సమయంలో నెలకు రూ.12,900 చెల్లిస్తారు. రెండో ఏడాది నెలకు రూ.15,000 చెల్లిస్తారు. శిక్షణ కాలం విజయవంతంగా పూర్తిచేసిన వారిని శాశ్వత ఉద్యోగులుగా నియమిస్తారు. అప్పుడు నెలకు రూ.25,070- రూ.35,070. వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తులను అన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25/11/2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ ; http://www.sailcareers.com/ పరిశీలించగలరు.