kidney Stone : కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారం, బరువు, వైద్య పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్వరం,వికారంతో, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు.

kidney Stone : కిడ్నీలో స్టోన్స్ సమస్యతో బాధపడుతున్న వారు ఈ ఆహారాల జోలికి వెళ్ళొద్దు !

kidney Stone

kidney Stone : కిడ్నీలో రాళ్లు వివిధ కారణాల వల్ల ఏర్పడతాయి. వాటిని చికిత్స చేయకుండా వదిలేస్తే కిడ్నీలనే ప్రభావితం చేస్తాయి. రాళ్లు మూత్ర నాళాలు, మూత్రపిండాలు, మూత్రాశయంలో ఏర్పడతాయి. మూత్రంలో అధిక మొత్తంలో ఖనిజాలు, లవణాలు ఉన్నప్పుడు, ఇవి కలిసిపోయి గట్టి రాయిని ఏర్పరుస్తాయి. ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, స్ట్రువైట్ రాళ్లను ఏర్పరచడానికి సాధారణ పదార్థాలు.

READ ALSO : Eating Corn : కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే మొక్కజొన్న

కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ఆహారం, బరువు, వైద్య పరిస్థితులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జ్వరం,వికారంతో, తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం పడటం వంటి లక్షణాలు మూత్రపిండాల్లో రాళ్ల ఉన్నాయనటానికి సాధారణ సంకేతాలు. ఈ లక్షణాలను గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించటం మంచిది. మందులు, శస్త్రచికిత్స, కొన్ని ఆహార మార్పులు వంటివి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్త పడటానికి వైద్యలు సిఫార్సులు చేస్తారు.

READ ALSO : Kidney Stones : చక్కెర పదార్ధాలతో కిడ్నీలో రాళ్ల ముప్పు !

ఆక్సలేట్లు శరీరంలో ఉత్పత్తి అవుతాయి. అలాగే మనం తినే ఆహారం నుండి గ్రహించబడతాయి. కాల్షియం ఆక్సలేట్‌తో కలిసి రాళ్లను ఏర్పడేలా చేస్తుంది. ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకున్నప్పుడల్లా కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తగినంత మొత్తంలో తీసుకోవాలి. బచ్చలికూర, బీట్‌రూట్‌లు మరియు క్యారెట్లు వంటి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను పరిమితం చేయటం మంచిది.

READ ALSO : Diabetic Nephropathy : డయాబెటిస్‌ ఉన్నవారు కిడ్నీ సమస్యలను ఎదుర్కోవటం ఎలాగంటే ?

ఏమి తినాలి..? ఏమి తినకూడదు

ఉప్పు తగ్గించండి ;

కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు ఆహారంలో ఉప్పు తీసుకోవడం తగ్గించాలి. ఫ్యాక్ట్ ఫుడ్, టొమాటో జ్యూస్, చైనీస్ ఫుడ్స్ లో ఎక్కువ మొత్తంలో ఉప్పు ఉంటుంది. అలాంటి వాటిని తినటం నివారించాలి. రోజువారి ఆహారంలో ఉప్పును తక్కువ మోతాదులో తీసుకోవాలి.

READ ALSO : kidney Stones : కాఫీ తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందా లేదా తగ్గుతుందా?

శీతల పానీయాలు, కెఫిన్

శరీరంలో డీహైడ్రేషన్‌కు కెఫిన్ ఒక కారణం. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కాఫీ,టీలు ఎక్కువగా తీసుకోరాదు. శీతల పానీయాలలో ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెంచుతుంది. కాబట్టి శీతలపానీయాలను నివారించాలి.

READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

విటమిన్ సి, ఆక్సలేట్

కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఆక్సలేట్, విటమిన్ సి ఉన్నఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. చాక్లెట్, టొమాటో, బచ్చలికూర, తృణధాన్యాలు మొదలైన వాటిలో ఆక్సలేట్ ఉంటుంది. ఇలాంటి వాటిని తినకుండా ఉండటం మేలు. అదే సమయంలో విటమిన్ సి అధికంగా తీసుకోవటాన్ని నివారించటం మంచిది. ఉసిరి, సోయాబీన్, పార్స్లీ, టొమాటో గింజలు, బెండకాయలు, ఉసిరికాయలు, ఎండు బీన్స్, పచ్చి బియ్యం, ఉసిరి పప్పు, సపోటా, గుమ్మడికాయ, శెనగలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య మరింత పెరిగే అవకాశాలు ఉంటాయి.

READ ALSO : కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే?

నాన్ వెజ్

నాన్ వెజ్ లో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. కిడ్నీ స్టోన్ సమస్య ఉన్నవారు నాన్-వెజ్ తీసుకోవడం తగ్గించటం మంచిది. తక్కువ ప్రోటీన్ ఆహారాన్ని తీసుకోవాలి. అధిక ప్రొటీన్ ఆహారాలు తినటం వల్ల మూత్రపిండాలపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. ఎక్కువ ప్రొటీన్ తీసుకుంటే ఎక్కువ పరిమాణంలో కాల్షియం మూత్రంలో విసర్జించబడుతుంది. అదే సమయంలో నాన్ వెజ్ తినడం వల్ల శరీరంలో ప్యూరిన్ పరిమాణం పెరిగి, యూరిక్ యాసిడ్ స్థాయి అధికమౌతుంది.

READ ALSO : Long Covid : లాంగ్ కోవిడ్ తో దెబ్బతింటున్న ఊపరితిత్తులు, మెదడు, కిడ్నీలు.. ఎంఆర్ఐ స్కానింగ్ ల ద్వారా నిర్ధారణ

పుచ్చకాయ,దానిమ్మ రసం, చెరకు

కొబ్బరి నీళ్లలో పీచు అధిక స్థాయిలో ఉంటుంది. కిడ్నీలో రాళ్లను నివారించడంలో ఈ పీచు తోడ్పడుతుంది. పప్పు దినుసులతో కూడిన కూరగాయలు తినడం వల్ల మేలు కలుగుతుంది. బఠానీలు, యాపిల్స్, పాలకూర, బేర్రీలను ఆహారంలో చేర్చుకోవాలి. చెరకు రసం, దానిమ్మ రసం మూత్రపిండాల్లో రాళ్లను నివారించటంలో సహాయపడతాయి.