JEE Main 2024 : జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో వ్రాయలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్‌ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ https://jeemain.ntaonline.in/ అందుబాటులో ఉంచారు.

JEE Main 2024 : జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

JEE Mains

JEE Main 2024 : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తన వెబ్‌సైట్ nta.nic.inలో 2024 JEE మెయిన్ పరీక్ష తేదీని విడుదల చేసింది. రెండు సెషన్ లలో పరీక్ష నిర్వహించనున్నారు. మొదటి సెషన్ జనవరిలో, మరొకటి ఏప్రిల్‌లో జరగనుంది. మొదటి సెషన్ జనవరి 24 నుండి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. రెండవ సెషన్ 2 ఏప్రిల్ 1 నుండి 15 వరకు నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ లు ఆన్ లైన్ విధానంలో నిర్వహిస్తారు.

అర్హతలు :

NTA JEE మెయిన్స్ పరీక్షకు అర్హతకు సంబంధించి10+2 తరగతి పరీక్షకు హాజరైన లేదా అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. 2022, 2023 విద్యాసంవత్సరంలో 12వ తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు వయస్సుతో సంబంధం లేకుండా పరీక్ష రాయవచ్చు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన సెంట్రల్/స్టేట్ బోర్డ్ నుండి 10+2 పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డులలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉన్నవారు అర్హులు. అభ్యర్థులు ఇంటర్ లో కనీసం 75% ఉత్తీర్ణత శాతం కలిగి ఉండాలి. SC/ST అభ్యర్థులు 75%కి బదులుగా 65% కనీస స్కోర్‌ ఉంటే అర్హులవుతారు.

BE/ B.Tech ప్రోగ్రామ్‌లకు అర్హత ; BE/ B.Tech ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి, అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ లలో ఏదైనా ఇతర సబ్జెక్ట్‌లతో ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

B.Arch / B. ప్లానింగ్ ప్రోగ్రామ్‌లకు అర్హత ; B.Arch / B. ప్లానింగ్ ప్రోగ్రామ్‌లకు అర్హత పొందాలంటే, అభ్యర్థులు తప్పనిసరిగా లాంగ్వేజ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, టెక్నికల్ వొకేషనల్ సబ్జెక్ట్ తోపాటు ఏదైనా ఇతర సబ్జెక్ట్‌లతో సహా ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

రిజిస్ట్రేషన్ :

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో వ్రాయలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా JEE మెయిన్ 2024 దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. JEE మెయిన్ 2024 కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్‌ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. JEE మెయిన్ 2024 కోసం నమోదు చేసుకోవడానికి వెబ్‌సైట్‌ https://jeemain.ntaonline.in/ అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు పంపరాదు. ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులను నింపితే అలాంటి అభ్యర్థులపై తదుపరి దశలో కఠిన చర్యలు తీసుకుంటామని NTA తెలిపింది.

13 భాషల్లోJEE మెయిన్స్ పరీక్ష ;

JEE (మెయిన్) – 2024 మొత్తం 13 భాషలలో నిర్వహించబడుతుంది. ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో జరుగుతుంది. వీటిలో మీకు అనుకూలమైన భాషలో పరీక్ష రాసేందుకు ఎంపిక చేసుకోవచ్చు.

జెఈఈ అసలు ఉద్దేశం ;

JEE మెయిన్ అనేది భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసించేందుకు ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తుంది. JEE మెయిన్ 2024 లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. అనగా, పేపర్ 1 మరియు పేపర్ 2 గా పరీక్ష నిర్వహిస్తారు. NITలు , IITలు, ఇతర కేంద్ర నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థల (CFTIలు) లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లను (BE/B.Tech.) అభ్యసించాలనుకునే అభ్యర్థుల కోసం పేపర్ 1 నిర్వహిస్తారు. సంస్థలు/విశ్వవిద్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వా భాగస్వామ్యనిధులతో గుర్తింపుపొందిన B. ఆర్చ్ , B. ప్లానింగ్ కోర్సులలో ప్రవేశానికి పేపర్ 2 నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం ;

స్టేజ్ 1 : ముందుగా NTA JEE ప్రధాన వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి వ్యక్తిగత వివరాలతో లాగిన్ ఐడి క్రియేట్ చేసుకోవాలి.

స్టేజ్ 2 ; వ్యక్తిగత, విద్యాసంబంధమైన వివరాలను నమోదు చేసుకోవాలి. పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలి.

స్టేజ్ 3: లేటెస్ట్ పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్, సంతకాన్ని స్కాన్ చేసిన కాపీలను అప్‌లోడ్ చేయాలి.

స్టేజ్ 4 ; అనంతరం పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది.

స్టేజ్ 5 ; నమోదు చేసిన అన్ని వివరాలను జాగ్రత్తగా చూసుకోవాలి. అవసరమైతే దిద్దుబాట్లు ఉంటే సరిచేసుకుని అప్లికేషన్ ను సబ్ మిట్ చేయాలి.

స్టేజ్ 6 : భవిష్యత్తు అవసరాలకోసం వివరాలతో కూడిన పేజీని డౌన్ లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.

దరఖాస్తు గడువు ;

JEE ప్రధాన సెషన్ 1 పరీక్ష 2024 కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ 30తో ముగుస్తుంది. దరఖాస్తు చేయడానికి వెబ్ సైట్ లింక్ ; https://jeemain.ntaonline.in/ పై క్లిక్ చేయండి