SSB Recruitment : ఎస్ఎస్ బిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

SSB Recruitment : ఎస్ఎస్ బిలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ

SSB Recruitment

Updated On : May 21, 2023 / 4:29 PM IST

SSB Recruitment : భారత హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సశస్త్ర సీమా బాల్ (ఎస్‌ఎస్‌బీ)లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 543 కానిస్టేబుల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వ్యక్తుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Worst Food Combinations : ఆల్కహాల్ తో కలిపి తీసుకోవటం మానేయాల్సిన 7 రకాల ఆహారాలు ఇవే !

వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, డ్రైవర్, వెటర్నరీ, కార్పెంటర్, బ్లాక్‌స్మిత్‌, వాటర్ క్యారియర్, పెయింటర్ తదితర కేటగిరీల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

READ ALSO : Oral Cancer : నోటి క్యాన్సర్‌కు కారణాలు ? దానిని నివారించడానికి చిట్కాలు !

రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్, స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.21,700ల నుంచి రూ.69,100 వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో జూన్ 18, 2023లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకోసం వెబ్‌సైట్‌ ; www.ssb.nic.in పరిశీలించగలరు.