UoH Job Vacancies : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో కన్సల్టెంట్ల పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పనిఅనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్ పీజ్ గా గాను నెలకు 40,000రూపాయలు చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

UoH Job Vacancies : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో కన్సల్టెంట్ల పోస్టుల భర్తీ

Recruitment of Consultants posts in University of Hyderabad

Updated On : March 3, 2023 / 3:24 PM IST

UoH Job Vacancies : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ వివిధ పోస్టులకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కన్సల్టెంట్ల పోస్టులకు నియామకాలు చేపట్టనుంది. కన్సాలిడేటెడ్ ఫీజ్ ప్రాతిపదికన ఇంటర్నల్ ఆడిట్ కార్యాలయంలో ఈ పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం రెండు ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎంకాం, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఉత్తీర్ణులై ఉండాలి. అంతేకాకుండా పనిఅనుభవం కలిగి ఉండాలి. కన్సల్టెంట్ పీజ్ గా గాను నెలకు 40,000రూపాయలు చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది.

READ ALSO : AP Global Investors Summit: ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.11.5 లక్షల కోట్ల ఒప్పందాలు.. వెల్లడించిన సీఎం జగన్

దరఖాస్తులను పంపాల్సిన చిరునామా డిప్యూట్ రిజిస్ట్రార్, రిక్రూట్ మెంట్ సెల్, అడ్మినేస్ట్రేషన్ బిల్డింగ్, యూవోహెచ్, హైదరాబాద్ చిరునామాకు పంపాలి. దరఖాస్తు పంపేందుకు ఆఖరు తేదిగా మార్చి 15, 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://uohyd.ac.in/ పరిశీలించగలరు.