AP Global Investors Summit: ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.11.5 లక్షల కోట్ల ఒప్పందాలు.. వెల్లడించిన సీఎం జగన్

విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం.

AP Global Investors Summit: ఏపీకి భారీ పెట్టుబడులు.. రూ.11.5 లక్షల కోట్ల ఒప్పందాలు.. వెల్లడించిన సీఎం జగన్

AP Global Investors Summit: ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని ప్రకటించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ మేరకు అనేక కంపెనీలతో ఎంవోయూలు కుదుర్చుకుంటున్నట్లు వెల్లడించారు.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

విశాఖపట్నంలో జరుగతున్న ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌-2023’లో భాగంగా శుక్రవారం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర పెట్టుబడుల గురించి వివరించారు. ‘‘ఏపీకి రూ.11.58 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. దీనిపై ఎంవోయూలు కుదుర్చుకున్నాం. వీటి ద్వారా 6 లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 340 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చాయి. తొలి రోజు 92 ఎంవోయూలు కుదిరాయి. దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది. ఈ సదస్సు ద్వారా 20 రంగాల్లో పెట్టుబడులు వచ్చాయి. రాష్ట్రంలో పుష్కలంగా నీటి వనరులు న్నాయి. ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చాం. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి.

IndiaVsAustralia: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన టీమిండియా

ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతం ఏపీ సొంతం. ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం అమలు చేస్తున్నాం. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్‌లు వస్తుంటే అందులో ఏపీలోనే 3 వస్తున్నాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్’లో వరుసగా మూడేళ్లు ఏపీ నెబర్ వన్‌గా నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందుతున్నాయి. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో నంబర్ వన్‌గా నిలిచాం. నైపుణ్యాభివృద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి సాధ్యమవుతుంది.

త్వరలో విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా మారుస్తాం. స్నేహపూర్వక పారిశ్రామిక విధానంతో ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఒక్క ఫోన్ కాల్‌తో పారిశ్రామికవేత్తల సమస్యలు పరిష్కరిస్తాం. భవిష్యత్‌లో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర’’ అని సీఎం జగన్ ప్రసంగించారు.