IndiaVsAustralia: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన టీమిండియా

76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది. మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 పరుగులు, శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేశారు.

IndiaVsAustralia: మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. చిత్తుగా ఓడిన టీమిండియా

IndiaVsAustralia: ఇండోర్ వేదికగా జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, మూడో టెస్టులో భారత్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 76 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 18.5 ఓవర్లలోనే విజయం సాధించింది.

Andhra Pradesh: రాజధాని కేసుల ముందస్తు విచారణ కోరిన ఏపీ.. నిరాకరించిన సుప్రీం కోర్టు

మూడోరోజు ప్రారంభంలోనే మ్యాచ్ ముగియడం విశేషం. మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. అత్యధికంగా విరాట్ కోహ్లీ 22 పరుగులు, శుభ్‌మన్ గిల్ 21 పరుగులు చేశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ కునేమన్ 5 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ ఆరంభించిన ఆస్ట్రేలియా 197 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట్స్‌మెన్లలో ఖవాజా అత్యధికంగా 60 పరుగులు చేశాడు. తర్వాత లబుషేన్ 31 పరుగులు, స్టీవెన్ స్మిత్ 26 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీయగా, అశ్విన్, ఉమేష్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్‌లో 88 పరుగుల ఆధిక్యం లభించింది.

Karnataka: ఎన్నికలకు ముందు బీజేపీకి ఎదురుదెబ్బ.. లంచం తీసుకుంటూ దొరికిపోయిన బీజేపీ ఎమ్మెల్యే కొడుకు

తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇండియాను లైయన్ దెబ్బకొట్టాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 8 వికెట్లు తీసుకున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 163 పరుగులు చేసి, ఆలౌటైంది. అత్యధికంగా పుజారా 59 పరుగులు చేశాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ 26 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియాకు భారత్ 76 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. తక్కువ లక్ష్యంతోనే బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఖవాజా డకౌట్ అయ్యాడు.

అయితే, తర్వాత ట్రావిస్ హెడ్ 49 పరుగులతో, లబుషేన్ 28 పరుగులతో లక్ష్యాన్ని చేధించారు. దీంతో ఒక వికెట్ కోల్పోయిన ఆసీస్ సులభంగా లక్ష్యాన్ని చేధించింది. గత రెండు మ్యాచుల్లో ఘోరంగా ఓడిపోయిన ఆసీస్.. ఈ మ్యాచులో విజయం ద్వారా తన పట్టు నిలుపుకొంది. నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇండియా 2-1తో ఆధిక్యంలో ఉంది.