Hindustan Copper Recruitment : హిందూస్ధాన్ కాపర్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

జియోలజీ, సర్వే, అర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ ఆర్, లా, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ, డిగ్రీ , పిజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Hindustan Copper Recruitment : హిందూస్ధాన్ కాపర్ లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Recruitment of job vacancies in Hindusthan Copper Limited

Updated On : February 21, 2023 / 12:43 PM IST

Hindustan Copper Recruitment : హిందూస్ధాన్ కాపర్ లిమిటెడ్ కోల్ కతాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజ్ మెంట్ ట్రైనీ, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైయినీ పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

జియోలజీ, సర్వే, అర్ అండ్ డీ, ఎం అండ్ సీ, ఫైనాన్స్, హెచ్ ఆర్, లా, ఎలక్ట్రికల్ తదితర విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ, డిగ్రీ , పిజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష తోపాటు, పర్సనల్ ఇంటర్వ్యూ మెరిట్ అధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు 40,000 నుండి 1.6లక్షల వరకు చెల్లిస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా 28 ఫిబ్రవరి 2023 ను నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.hindustancopper.com/ పరిశీలించగలరు.