MECL Recruitment
MECL Recruitment : మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్(ఎంఈసీఎల్)లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 94 ఎగ్జిక్యూటివ్ & నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Priyanka vs Modi: వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగితే నరేంద్రమోదీ ఓడిపోతారా?
పోస్టుల వారిగా ఖాళీల వివరాలను పరిశీలిస్తే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్)1, మేనేజర్ (జియాలజీ)1,అసిస్టెంట్ మేనేజర్(జియాలజీ)1,అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)3, అసిస్టెంట్ మేనేజర్(హెచ్‌ఆర్)1, ఎలక్ట్రికల్ ఇంజినీర్1,జియాలజిస్ట్ 14 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Arthritis Pain : కీళ్ల నొప్పులు తగ్గించే అద్భుతమైన 5 పండ్లు!
నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి అకౌంటెంట్6, హిందీ ట్రాన్స్‌లేటర్1,టెక్నీషియన్(సర్వే & డ్రాఫ్ట్స్‌మన్)6 ,టెక్నీషియన్(సర్వే & డ్రాఫ్ట్స్‌మన్)6, టెక్నీషియన్(సాంపిలింగ్) 10, అసిస్టెంట్(మెటీరియల్స్)5,అసిస్టెంట్(అకౌంట్స్)4 పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Tulsi Leaves : మధుమేహ నియంత్రణలో తులసి ఆకుల పాత్ర కీలకమే !
పోస్టుల వారీగా విద్యార్హతలు, వయస్సు నిర్ణయించారు. విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగాను జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్- సర్వీస్‌మెన్, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 13, 2023 ఆఖరుతేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.mecl.co.in/ పరిశీలించగలరు.