Arthritis Pain : కీళ్ల నొప్పులు తగ్గించే అద్భుతమైన 5 పండ్లు!

మన ఆహారపు అలవాట్ల వల్లనైతేనేమి, ఆధునిక జీవనశైలి అయితేనేమి.. కారణం ఏదైనా... ఎప్పుడో యాభై, అరవైలలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు నలభయ్యేళ్లలోనే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల నొప్పుల నుంచి కూడా కొన్ని రకాల పండ్లు కాపాడుతాయి.

Arthritis Pain : కీళ్ల నొప్పులు తగ్గించే అద్భుతమైన 5 పండ్లు!

reduce joint pain

Updated On : August 14, 2023 / 12:09 PM IST

Arthritis Pain : రోజుకు ఒక యాపిల్ తినండి.. డాక్టర్ కి దూరంగా ఉండండి అనిఅంటారు గానీ… అసలు పండ్లు అంటేనే ఆరోగ్యానికి దారి చూపేవి. ఈ పండ్లలో కొన్ని రకాలు కీళ్ల నొప్పుల బాధ నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి.

READ ALSO : Heart Health : రోజుకు 11 నిమిషాలు నడిస్తే చాలు.. గుండె ఆరోగ్యం భేష్

కీళ్ల నొప్పులు రావడానికి ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక జబ్బులే రానక్కరలేని. మూడు పదుల్లో కూడా కాండ్రోమలేషియా లాంటి సమస్యలు, ప్రమాదాల్లో కలిగే గాయాల వంటి కారణాల వల్ల కూడా కీళ్లు, మోకాళ్ల నొప్పులు రావచ్చు. కొందరికి జన్యుపరమైన కారణాలు, ర్యుమటాయిడ్ఆర్థరైటిస్ లాంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు కూడా కీళ్ల నొప్పులకు కారణం కావొచ్చు.

మన ఆహారపు అలవాట్ల వల్లనైతేనేమి, ఆధునిక జీవనశైలి అయితేనేమి.. కారణం ఏదైనా… ఎప్పుడో యాభై, అరవైలలో రావాల్సిన కీళ్ల నొప్పులు ఇప్పుడు నలభయ్యేళ్లలోనే కనిపిస్తున్నాయి. అయితే.. ఈ ఆర్థరైటిస్ లాంటి కీళ్ల నొప్పుల నుంచి కూడా కొన్ని రకాల పండ్లు కాపాడుతాయి.

READ ALSO : Congress : కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్

ఆర్థరైటిస్ ను నయం చేయలేం. కానీ కొన్ని పండ్లలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి. అందుకే ఆ పండ్ల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

యాపిల్ : యాపిల్ రుచికరంగా ఉండడమే కాదు.. ఇది తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. యాపిల్స్ లో ఉండే ఇన్ ఫ్లమేటరీ ఎఫెక్ట్ లకు పేరుగాంచిన ఫ్లేవనాయిడ్ అయిన క్వెర్సెటిన్ ఈ నొప్పి తగ్గించడంలో సహాయపడుతుంది. అందుకే రోజుకో యాపిల్ తినండి.. ఆర్థరైటిస్ బాధను తగ్గించుకోండి.

READ ALSO : Rice Cultivation : వరిలో అధిక దిగుబడులకోసం సమగ్ర యాజమాన్యం

చెర్రీస్ : చెర్రీస్ లో రకాలుంటాయి. అందులో టార్ట్చెర్రీస్ లో ఆంథోసయనిన్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన సమ్మేళనాలు. శరీరంలో ఇన్ ఫ్లమేషన్, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. చెర్రీజ్యూస్ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారిలో ఇన్ ఫ్లమేషన్ మార్కర్లు తగ్గుతాయని, నొప్పి స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

పైనాపిల్ : ఇందులో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బ్రోమెలిన్శరీరంలో ఇన్ ఫ్లమేషన్ కు కారణమయ్యే పదార్థాల ఉత్పత్తిని తగ్గిస్తుంది. ఆహారంలో పైనాపిల్ చేర్చుకోవడం ద్వారా ఈ రకమైనవాపును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ చెర్రీలు తీసుకుంటేకీళ్లనొప్పులు, వాపు వంటి ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

READ ALSO : Heart Attack: గుండెపోటుకు ప్రధాన కారణం ఆ సమస్యే.. తాజా అధ్యయనంలో వెలుగులోకి ఆసక్తికర విషయాలు

బ్లూబెర్రీస్ : బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. అంతేకాదు దీనిలో ఉండే అనేక రకాల పదార్థాలు ఇన్ ఫ్లమేషన్ ని కూడా తగ్గిస్తాయి. వీటిలో ఉండే ఆంథోసయనిన్లు, ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అందించే ప్రయోజనాలు అపరిమితం. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హానికరమైన ప్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. అందువల్ల శరీరంలో ఇన్ ఫ్లమేషన్ తగ్గుతుంది. దాంతో ఆర్థరైటిస్ లక్షణాలు కూడా మెల్లగా అదుపులోకి వస్తాయి.

నారింజ : నారింజలుతిన్నప్పుడల్లా చాలా రిఫ్రెష్ గా అనిపిస్తుంది. దీనికి కారణం వీటిలోని విటమిన్ సి. విటమిన్ సి వాపు తగ్గించడంలో,ఆక్సిడేటివ్ స్ట్రెస్ పోగొట్టడంలో కీలక పాత్ర పోషిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి రక్షణగా ఉంటాయి. అందుకే నారింజను అలాగే పండుగా గానీ, లేదాజ్యూస్ గా గానీ ఎలా తీసుకున్నా ప్రయోజనకరమే. ఇంకెందుకాలస్యం… నారింజ రసం కచ్చితంగా మీ డైట్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకోండి.