Priyanka vs Modi: వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగితే నరేంద్రమోదీ ఓడిపోతారా?

ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు.

Priyanka vs Modi: వారణాసి నుంచి ప్రియాంక గాంధీ పోటీకి దిగితే నరేంద్రమోదీ ఓడిపోతారా?

Updated On : August 14, 2023 / 2:45 PM IST

2024 Elections: కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్రా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగాణాల మధ్య శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆమె కనుక ప్రధానమంత్రి నరేంద్రమోదీ మీద వారణాసిలో పోటీ చేస్తే మోదీ తప్పకుండా ఓడిపోవచ్చని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమేథి, రాయ్‭బరేలీ లోక్‭సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు. గాంధీ కుటుంబీకులు ఆ స్థానాల్లోనే పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే వారణాసి కూడా అలా ఉండబోతున్నట్లు రౌత్ జోస్యం చెప్పారు.

Minister Nitin Gadkari : వీఐపీల వాహనాలకు సంగీతం, సైరన్ ప్లేస్‌లో భారతీయ సంగీతం : మంత్రి నితిన్‌ గడ్కరీ

వారణాసి ప్రజలు ప్రియాంక గాంధీని కోరుకుంటున్నారని వాస్తవానికి అమేథి, రాయ్‭బరేలీతో పాటు వారణాసి స్థానాలు బీజేపీకి చాలా క్లిష్టంగా మారాయని సంజయ్ రౌత్ అభిప్రాయపడ్డారు. ప్రియాంక రంగంలోకి దిగితే మోదీకి గట్టి పోటీ ఉంటుందని, ఓడిపోయే అవకాశాలు లేకపోలేదని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. మోదీ మీద పోటీ చేస్తే ప్రియాంక గాంధీ తప్పకుండా గెలుస్తుందని ఆయన అంటున్నారు.

MLA Anil Kumar Yadav: సోనియా గాంధీనే భయపెట్టిన వ్యక్తి జగన్‌.. పవన్ వారాహికి పెట్రోల్ దండగ ..

వాస్తవానికి ప్రియాంక గాంధీ పోటీ గురించి చాలా రోజులుగానే చర్చ జరుగుతోంది. రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రియాంక.. కొద్ది రోజుల క్రితమే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అంతకు ముందు ఆమె సోనియా, రాహుల్ పోటీ చేసే నియోజకవర్గాల్లో మాత్రమే ప్రచారం చేసేవారు. ప్రియాంకను పార్లమెంటుకు పంపించాలని, అందుకు ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని తాజాగా ఆమె భర్త రాబర్ట్ వాద్రా అన్నారు. దీంతో ప్రియాంక ఎన్నికల్లోకి దిగబోతున్నారని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.