Durgapur Job Vacancies : దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 10 ఏళ్లు పని అనుభవం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 06 ఏళ్లు పని అనుభవం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 0-3 ఏళ్లు పని అనుభవం కలిగి ఉండాలి.

Durgapur Job Vacancies
Durgapur Job Vacancies : దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో పలు టీచింగ్ పోస్టులను భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 ఖాళీలను భర్తీ చేయనున్నారు. బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీర్,కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీర్,కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్,ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్,ఎలక్ట్రికల్ ఇంజినీర్,ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ స్టడీస్, మ్యాథమెటిక్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఎస్/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 10 ఏళ్లు పని అనుభవం, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 6 ఏళ్లు పని అనుభవం, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 3 ఏళ్లు పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.159100 నుండి రూ.220200 చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.139600 నుండి రూ.211300 చెల్లిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు నెలకు రూ.70900నుండి167400 చెల్లిస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన చిరునామా ; రిజిస్ట్రార్, ఎన్ఐటి దుర్గాపూర్, మహాత్మగాంధీ ఎవెన్యూ, దుర్గాపూర్ 713209, వెస్ట్ బెంగాల్, ఇండియా. పూర్తి సమాచారం కోసం వెబ్ సైట్ ; www.nitdgp.ac.in పరిశీలించగలరు.