TSNPDCL Recruitment : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ లో ఉద్యోగ ఖాళీల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.200. నిర్ణయించారు.

TSNPDCL Recruitment
TSNPDCL Recruitment : వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(ఎన్‌పీడీసీఎల్)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. కంప్యూటర్ అప్లికేషన్/ఆఫీస్ ఆటోమేషన్ (ఎంఎస్ ఆఫీస్) సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండాలి. దరఖాస్తు ఫీజుగా రూ.200. నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ, పీహెచ్‌సీ, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
READ ALSO : Foods to Avoid in Summer : వేసవిలో ఈ ఆహారాల విషయంలో జాగ్రత్తలు ఆరోగ్యానికి మంచిది !
రెగ్యులర్ ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి. రాతపరీక్ష, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో ఆర్టీసియన్స్‌గా పనిచేస్తున్న వారికి 20 శాతం వెయిటేజీ ఇస్తారు. ఎంపికైనవారు వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ సర్కిళ్ల పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన వారికి వేతనంగా రూ.29,255 నుండి రూ.54,380 చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరితేదిగా 29.04.2023 నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; http://tsnpdcl.cgg.gov.in పరిశీలించగలరు.