PGCIL Recruitment : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఆఫీసర్ ట్రైనీ పోస్టుల భర్తీ

శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది.

PGCIL Recruitment : న్యూఢిల్లీలోని పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఆఫీసర్ ట్రైనీ(లా) పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

READ ALSO : JEE Main 2024 : జెఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం

భర్తీ చేయనున్న ఖాళీలలో జనరల్- 05, ఈడబ్ల్యూఎస్- 01, ఓబీసీ(ఎన్‌సీఎల్)-02, ఎస్సీ- 01, ఎస్టీ- 01. వీటిలో దివ్యాంగులకు 1 పోస్టును కేటాయించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు 60 శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ లేదా ఇంటిగ్రేటెడ్ లా/ ఎల్‌ఎల్‌బీ కోర్సు ఉత్తీర్ణతతో పాటు క్లాట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

READ ALSO : Cobra : సోఫాలో కూర్చున్న వ్యక్తి షాక్…ఎందుకంటే బుసలుకొట్టే నాగుపాము చూసి…

వయోపరిమితి విషయానికి వస్తే 28 సంవత్సరాలు మించరాదు ఓబీసీ(ఎన్‌సీఎల్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, మాజీ సైనికులు, అల్లర్ల బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోసడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ;

క్లాట్‌-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్‌/ఇంటర్వ్యూ/పవర్‌గ్రిడ్‌లో చేరే సమయంలో వెరిఫికేషన్ కోసం అభ్యర్థులు తమ క్లాట్‌-2024 అడ్మిట్ కార్డ్/హాల్ టిక్కెట్‌ని తీసుకురావాల్సి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఎంపిక విధానం ఉంటుంది. ఇందులో క్లాట్‌-2024 స్కోర్ 85 శాతం మార్కులు, గ్రూప్ డిస్కషన్‌ను 3 శాతం మార్కులు, ఇంటర్వ్యూకు 12 శాతం మార్కులు కేటాయిస్తారు.

READ ALSO :Menopause Prevention : మెనోపాజ్ సమయంలో మహిళలు పాటించాల్సిన జాగ్రతలు !

క్లాట్‌-2024 అర్హత మార్కులకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు. ఇంటర్వ్యూలో అర్హత మార్కులను జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతంగా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 30 శాతంగా నిర్ణయించారు.

శిక్షణ కాలంలో స్టైఫండ్ రూ. 40,000. శిక్షణ పూర్తయిన తరువాత నెలకు రూ.50,000 నుంచి రూ.1,60,000.వేతనంగా చెల్లిస్తారు. ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు సంస్థలో కనీసం 3 సంవత్సరాలు విధిగా పనిచేస్తామని రూ.5 లక్షల సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2.5 లక్షలకు బాండ్ ఇవ్వాలి.

READ ALSO : Paddy Cultivation : వరిలో కాండంతోలుచు పురుగు, సుడిదోమ..నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన సస్యరక్షణ

దరఖాస్తు ప్రక్రియ ;

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.500. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు వర్తిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం09.11.2023 న ప్రారంభమవుతుంది. నవంబరు 29 దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.powergrid.in/ పరిశీలించగలరు.

ట్రెండింగ్ వార్తలు