ECIL Hyderabad : ఈసీఐఎల్ హైదరాబాద్ లో ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సీఎస్‌ఈ,ఈసీసీ,మెకానికల్,ఐటీ,ఈఈఈ, ఎలక్ట్రికల్,ఈటీసీ,ఈఐ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 33 యేళ్లకు మించకుండా ఉండాలి.

ECIL Hyderabad
ECIL Hyderabad : హైదరాబాద్‌లోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల పనిచేయుటకు.. 51 ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సీఎస్‌ఈ,ఈసీసీ,మెకానికల్,ఐటీ,ఈఈఈ, ఎలక్ట్రికల్,ఈటీసీ,ఈఐ స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌లో ఫస్ట్ క్లాస్ మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 33 యేళ్లకు మించకుండా ఉండాలి. ఆగస్టు 18 నుంచి 24 వరకు నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరుకావచ్చు.
ఎంపికైన వారికి మొదటి ఏడాది రూ.40,000లు, రెండో సంవత్సరం రూ.45,000లు, మూడో సంవత్సరం రూ.50,000లు, నాలుగో సంవత్సరం రూ.55,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇంటర్వ్యూకు సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ecil.co.in/ పరిశీలించగలరు.