AIIMS-Nagpur Recruitment : నాగ్‌పుర్ ఎయిమ్స్ లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ
సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 చెల్లిస్తారు.

AIIMS Nagpur
AIIMS-Nagpur Recruitment : నాగ్‌పుర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో వివిధ విభాగాల్లో సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Tomato Prices : ఇద్దరు పిల్లల్ని తాకట్టు పెట్టి టమటాలు కొనుగోలు చేసిన వ్యక్తి ..
విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే అనస్థీషియాలజీ5, బర్న్స్& ప్లాస్టిక్ సర్జరీ1, కార్డియాలజీ4, ఈఎన్‌టీ1, ఫోరెన్సిక్ మెడిసిన్1,జనరల్ మెడిసిన్3, జనరల్ సర్జరీ 2, మెడికల్ హెమటాలజీ1, మైక్రోబయాలజీ1 , నియోనాటాలజీ2, నెఫ్రాలజీ2, న్యూరోసర్జరీ3, న్యూక్లియర్ మెడిసిన్2, ఒబెస్ట్ట్రిక్స్ & గైనకాలజీ1, పీడియాట్రిక్స్1, పీడియాట్రిక్స్ సర్జరీ2, ఫార్మకాలజీ1, వీటితోపాటుగా ఫిజికల్ మెడిసిన్ మరియు రిహాబిలిటేషన్1, సైకియాట్రీ1, పల్మనరీ మెడిసిన్2, రేడియోడయాగ్నోసిస్2, రేడియోథెరపీ1, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ2, సర్జికల్ ఆంకాలజీ1, ట్రామా & ఎమర్జెన్సీ4, యూరాలజీ 2 ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Sandra Venkata Veeraiah: నేను టీడీపీలో ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు..: ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య
సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్ధుల వయస్సు 45 సంవత్సరాలు మించకూడదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.67,700 చెల్లిస్తారు.
READ ALSO : Filmnagar Accident : ఫిలింనగర్ లో బెంజ్ కారు బీభత్సం.. హై హీల్స్ భుజాన వేసుకుని వెళ్లిపోయిన యువతి
అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02.08.2023. నిర్ణయించారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూ/ రాత పరీక్ష 04.08.2023. జరగనుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://aiimsnagpur.edu.in/ పరిశీలించగలరు.