REET 2025 Application : రీట్ 2025 దరఖాస్తు ప్రక్రియ త్వరలో ప్రారంభం.. పూర్తి వివరాలివే!

REET 2025 : రీట్ 2025 పరీక్ష లెవల్ 1, లెవెల్ 2 రెండింటికీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 1న ప్రారంభమవుతుంది.

REET 2025 Application Process To Start Soon

REET 2025 : రాజస్థాన్ ఎలిజిబిలిటీ ఎగ్జామినేషన్ ఫర్ టీచర్స్ (REET) 2024 పరీక్ష త్వరలో జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం..  ఫిబ్రవరి 25, 2025న పరీక్ష జరగాల్సింది. స్టేట్ ఎడ్యూకేషన్ ప్రకటించిన విధంగా రీట్ 2025 పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్ డిసెంబర్ 1న ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు రీట్ పరీక్ష దరఖాస్తు చేసుకోవచ్చు.

రీట్ 2025 : ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకోండిలా :

  • అధికారిక వెబ్‌సైట్‌ (rajeduboard.rajasthan.gov.in)ను విజిట్ చేయండి.
  • హోమ్‌పేజీలో, రీట్ పరీక్ష పేజీని ఓపెన్ చేయండి.
  • మీరు కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతారు.
  • “REET” అప్లికేషన్ లింక్ క్లిక్ చేయండి
  • లాగిన్ వివరాలను పొందేందుకు రిజిస్టర్ చేసుకోండి.
  • మీ అకౌంట్ లాగిన్ చేయండి. వ్యక్తిగత వివరాలను అందించడం ద్వారా ఫారమ్‌ను నింపండి.
  • పేమెంట్ చేయండి. సబ్మిట్‌పై క్లిక్ చేయండి
  • ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కన్ఫార్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేయండి

రీట్ అనేది 1-5, 6-8 తరగతులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష. రీట్ 2024 పరీక్ష రెండు స్థాయిలుగా విభజించారు.

లెవల్ 1 : ఇందులో 5 సబ్జెక్టులు ఉన్నాయి. లాంగ్వేజ్ I, లాంగ్వేజ్ II, చైల్డ్ డెవలప్‌మెంట్, పెడాగోజీ, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. ప్రశ్నలు 10వ తరగతి క్లిష్ట స్థాయిని కలిగి ఉంటాయి. అభ్యర్థులకు పరీక్షను పూర్తి చేయడానికి 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.

లెవల్ 2 : ఈ పరీక్ష 300 మార్కులకు 150 మల్టీ-ఆప్షనల్ ప్రశ్నలు (MCQ) కలిగి ఉంటుంది. అభ్యర్థులు ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు పొందుతారు. కానీ, ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కు తొలగిస్తారు.

Read Also : Best Phones India : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? ఈ డిసెంబర్‌లో రూ. 10వేల లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్లు ఇవే.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!