UPSC: యూపీఎస్సీలో 28 పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్, ఎండీ ఉత్తీర్ణత సాధించటంతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Upsc
UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లో పలు పోస్టుల భర్తీకి ఆసక్తిగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. మైన్స్ సేప్టీ, ఎకనమిక్ ఇన్వెస్టిగేషన్, అప్తమాలజీ, సివిల్ తదితర విభాగాల్లో డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, లెక్చరర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్, ఎండీ ఉత్తీర్ణత సాధించటంతోపాటు పనిలో అనుభవం కలిగి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి రిక్రూట్ మెంట్ టెస్ట్ , ఇంటర్య్వూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
అసక్తిగల అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. అభ్యర్ధులు దరఖాస్తులు పంపటానికి ఆఖరు తేదీగా ఏప్రిల్ 14, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.upsc.gov.in/సంప్రదించగలరు.