ICMR JOBS : ఐసీఎంఆర్ లో 89 సైంటిస్ట్ పోస్టుల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీవీఎస్సీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.

Icmr Jobs
ICMR JOBS : న్యూ దిల్లీ లోని భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) లో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 89 సైంటిస్ట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న వాటిలో సైంటిస్టు ఈ పోస్టులు 7, సైంటిస్ట్ సి పోస్టులు 82 ఉన్నాయి. పబ్లిక్ హెల్త్ అండ్ ఎంటమాలజీ, వెటర్నరీ ఫాథాలజీ, వెటర్నరీ బయో కెమిస్ట్రీ, బయోఇన్ఫర్మాటిక్స్, బయోస్టాటిస్టిక్స్, అప్లైడ్ బయాలజీ తదితరాలు ఉన్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీవీఎస్సీ, ఎంబీబీఎస్, మెడికల్ పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది జూన్ 5,2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://recruit.icmr.org.in/ పరిశీలించగలరు.