CGCRI JOBS : కోల్ కతాలోని సీఎస్ఐఆర్ సీజీసీఆర్ఐ లో పోస్టుల భర్తీ
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష, అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

Csir Cgcri In Kolkata
CGCRI JOBS : కోల్ కతాలోని సీఎస్ ఐఆర్ సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (సీజీసీఆర్ఐ) లో పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 70 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీలకు సంబంధించి టెక్నీషియన్లు 32, టెక్నికల్ అసిస్టెంట్లు 38 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధులు అర్హతల విషయానికి వస్తే పోస్టులన్ని అనుసరించి పదో తరగతి ఐటీఐ, ఇంజినీరింగ్ డిప్లొమా, బీఎస్సీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి ట్రేడ్ టెస్ట్ , రాత పరీక్ష, అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 31, 2022గా నిర్ణయించారు. ఆప్ లైన్ దరఖాస్తులను జూన్ 15,2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.cgcri.res.in/పరిశీలించగలరు.