Cgcri
Cgcri : భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన కోల్ కత్తాలోని సీఎస్ఐఆర్ – సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (cgcri)లో సైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. మొత్తం 14 పోస్టుల ను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా, ఆసక్తి కలిగిన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంబంధిత పోస్టులకు ధరఖాస్తు చేసే అభ్యర్ధులు ఎంఈ, ఎంటెక్, పీహెచ్ డీలో ఉత్తీర్ణత సాధించటంతోపాటు, పనిలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 32 సంవత్సరాలు మించకుండా ఉండాలి. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు 67,700 రూపాయల వేతనంతోపాటు, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు.
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. పూర్తి చేసిన ధరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా పంపవచ్చు. ఆన్ లైన్ ధరఖాస్తులకు చివరితేదిగా అక్టోబరు 15 కాగా ఆఫ్ లైన్ ప్రింట్ కాపీలను పంపటానికి అక్టోబరు 31ని ఆఖరు తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.cgcri.res.in/