UPSC JOBS : యూపీఎస్సీ అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ పోస్టుల భర్తీ

పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరితేది జూన్ 30, 2022గా నిర్ణయించారు.

UPSC JOBS : యూపీఎస్సీ అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ పోస్టుల భర్తీ

Jobs

Updated On : June 12, 2022 / 11:41 AM IST

UPSC JOBS : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివిధ ప్రభుత్వ విభాగాల్లో పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఖాళీల వివరాలకు సంబంధించి సైంటిఫిక్ ఆఫీసర్ ఫిజికల్ రబ్బర్ ప్లాస్టిక్ టెక్స్ టైల్స్ 1 ఖాళీ, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ 21 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 2 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, జియాలజీలోమాస్టర్స్ డిగ్రీ లేదా, కెమికల్ ఇంజినీరింగ్, టెక్స్ టైల్ టెక్నాలజీ, రబ్బర్ టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, పాలిమర్ అండ్ రబ్బర్ టెక్నాలజీ, కెమికల్ టెక్నాలజీలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటుగా, సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి. పరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరితేది జూన్ 30, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsc.gov.in/ పరిశీలించగలరు.