దరఖాస్తు చేసుకోండి: బాసరలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 06:16 AM IST
దరఖాస్తు చేసుకోండి: బాసరలో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

Updated On : October 16, 2019 / 6:16 AM IST

రాజీవ్‌గాంధీ యూనివ‌ర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాల‌జీస్ (RGUKT) బాస‌ర… తాత్కాలిక ప్రాతిప‌దిక‌న గెస్ట్ ఫ్యాక‌ల్టీ భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఇందుకు సంబంధిత సబ్జెక్టులో కనీసం 60 శాతం మార్కులు లేదా తత్సమాన గ్రేడ్‌తో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుండాలి. ST, SC,  అభ్యర్థులకు మాత్రం 50 శాతం మార్కులు ఉంటే చాలు. 

విభాగాలు: 
సివిల్‌, కంప్యూట‌ర్ సైన్స్, ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (EEE), మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ,
మ్యాథ‌మేటిక్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌, తెలుగు.

ఎంపిక విధానం :
రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధానంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

వెతనం :
ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.30వేలు, మిగిలిన పోస్టులకు నెలకు రూ.20వేలు.

దరఖాస్తు ఫీజు:
జనరల్, OBC అభ్యర్ధులకు రూ. 150, SC, ST అభ్యర్ధులు మాత్రం రూ.100 చెల్లిస్తే సరిపోతోంది.

Read Also: టెన్త్ పిల్లలకు కొత్త ఎగ్జామ్స్ : బిట్ పేపర్ రద్దు, మార్కులు మారాయి