RRB ‘JE’ పరీక్ష షెడ్యూలు విడుదల
వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న 13,487 పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. వీటిల్లో జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS), కెమికల్ & మెటలర్జికల్ అసిస్టెంట్ (CMA) పరీక్ష తేదీలను రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు రిలీజ్ చేసింది.
అసలు షెడ్యూలు ప్రకారం.. మే 22 నుంచి స్టేజ్-1 ఆన్‌లైన్ పరీక్షలు (CBT) నిర్వహించనున్నారు. అభ్యర్థులు పరీక్షకు నాలుగురోజుల ముందుగానే తమ హల్ టికెట్లను దగ్గర పెట్టుకోవాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు హల్ టికెట్లతో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకెళ్లాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
రెండు దశల ఆన్‌లైన్ పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. స్టేజ్-1 రాతపరీక్షలో ఉత్తీర్ణులైన వారినే స్టేజ్-2 పరీక్షలకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
* మొత్తం 100 మార్కులకు ‘స్టేజ్-1’ పరీక్ష నిర్వహిస్తారు.
* ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 90 నిమిషాలు.
* రాతపరీక్షల్లో నెగిటివ్ మార్కులు ఉంటాయి.
* మొత్తం 150 మార్కులకు ‘స్టేజ్-2’ పరీక్ష నిర్వహిస్తారు.
* ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. పరీక్ష సమయం 120 నిమిషాలు.