Sail Recruitment 2023 : పదోతరగతి పాసయ్యారా ? అయితే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి !
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత రంగంలో డిప్లొమా సర్టిఫికేట్‌తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అటెండెంట్ పోస్టుకు ఐటీఐ సర్టిఫికెట్‌తోపాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

Sail Recruitment 2023
Sail Recruitment 2023 : స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAIL) రూర్కెలాలో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆపరేటర్లు మరియు టెక్నీషియన్ల భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో 30 టెక్నీషియన్ పోస్టులు, 110 అటెండర్ పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Drinks for Weight Loss : బరువు తగ్గించటంలో సహాయపడే 7 పానీయాలు ఇవే !
అర్హతలు ;
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తుకోవచ్చు. ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు సంబంధిత రంగంలో డిప్లొమా సర్టిఫికేట్‌తో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అటెండెంట్ పోస్టుకు ఐటీఐ సర్టిఫికెట్‌తోపాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి ;
వయోపరిమితి విషయానికొస్తే కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 28 సంవత్సరాలు ఉండాలి.
READ ALSO : Telangana Elections 2023 : గులాబీ దూకుడు .. ఒకేరోజు సీఎం కేసీఆర్ నాలుగు సభలు, కేటీఆర్ నాలుగు రోడ్ షోలు
జీతం ;
ఆపరేటర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్-3 గ్రేడ్ కింద రూ.26,600 నుంచి రూ.38,920 వరకు జీతం చెల్లిస్తారు. శిక్షణ కాలం పూర్తయిన తర్వాత, అటెండర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎస్1 గ్రేడ్ కింద రూ.25070-35070 వరకు జీతం అందజేస్తారు.
దరఖాస్తు ;
దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 16, 2023గా నిర్ణయించారు.
READ ALSO : Lemon Water : ప్రతి రోజు నిమ్మకాయ నీరు తాగుతున్నారా?… అయితే మీరు డేంజర్ లో పడ్డట్టే !
దరఖాస్తు ఫీజు ;
ఆపరేటర్ పోస్టులకు రూ. 650 అప్లికేషన్ ఫీజు ఉండగా, అటెండెంట్ పోస్టుకు దరఖాస్తు రుసుము రూ.400గా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం ;
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. దీనికోసం అభ్యర్థులు SAIL అధికారిక వెబ్‌సైట్, sail.co.in ను సందర్శించాలి.