Telangana Elections 2023 : గులాబీ దూకుడు .. ఒకేరోజు సీఎం కేసీఆర్ నాలుగు సభలు, కేటీఆర్ నాలుగు రోడ్ షోలు

ఎన్నికల తేదీ దగ్గరపడుతుంటంతో గులాబీ బాస్ దూకుడు పెంచారు. మంత్రి కేటీఆర్ సైతం వరస ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అలా ఈరోజు తండ్రీ కొడుకులు ఇద్దరు నాలుగు సభలు, నాలుగు రోడ్ షోలతో బిజీ బిజీగా గడపనున్నారు.

Telangana Elections 2023 : గులాబీ దూకుడు .. ఒకేరోజు సీఎం కేసీఆర్ నాలుగు సభలు, కేటీఆర్ నాలుగు రోడ్ షోలు

CM KCR..minister KTR

CM KCR And minister KTR : ఎన్నికల తేదీ దగ్గరపడుతుంటంతో తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇలా ప్రధాన పార్టీలు అన్ని ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. విమర్శలు ప్రతి విమర్శలతో హీటెక్కిస్తున్నారు. ఏ పార్టీకి ఆ పార్టీ నేతలు గెలుపు తమదేనని..ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామే అంటూ ధీమాగా ఉన్నారు. అయినా ఓటర్లు ఆకట్టుకునేందుకు వరాలు కురిపిస్తునే ఉన్నారు. బీఆర్ఎస్ బీజేపీ, కాంగ్రెస్ లపై ఘాటు విమర్శలు చేస్తుంటే..కాంగ్రెస్ బీఆర్ఎస్, బీజేపీలు ఒక్కటే అని ఆ రెండు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా ఒక్కటే అంటూ ప్రచారం చేస్తున్నాయి.

ఢిల్లీ అగ్రనేతలే కాదు..తాజాగా బీజేపీకి రాజీనామా చేసిన కాంగ్రెస్ లోకి వచ్చిన విజయశాంతి కూడా అదే రీతిలో విమర్శలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ లు ఒక్కటే అని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ బీజేపీని డిక్టేట్ చేస్తున్నారని ప్రధాని మోదీతో పాటు ఢిల్లీ బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వం అవినీతి అంటూ ఆరోపణలు చేస్తున్నారు కానీ చర్యలు మాత్రం తీసుకోవటంలేదు అంటూ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇలా విమర్శలు ఎలా ఉన్నా గులాజీ నేతలు మరీ ముఖ్యంగా గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వరస కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉంటున్నారు.

తెలంగాణలో ఎన్నికల ప్రచారాస్త్రంగా మారిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు

ఈక్రమంలో మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని..గులాబీ బాస్ కృత నిశ్చయంతో ఉన్నారు. దీంట్లో భాగంగా సీఎం కేసీఆర్ ఒకే రోజు రెండు మూడు సభల్లో పాల్గొంటు బిజీ బిజీగా గడుపుతున్నారు. అంతేకాదు అంతకు మించి అన్నట్లుగా సోమవారం (నవంబర్ 20,2023) సీఎం కేసీఆర్ ఏకంగా నాలుగు సభల్లో పాల్గొననున్నారు. మానకొండూరు, స్టేషన్ ఘన్ పూర్,నకికేరల్, నల్లగొండల్లో ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు.

అలాగే మంత్రి కేటీఆర్ కూడా ఈరోజు నాలుగు రోడ్ షోల్లో పాల్గొంటున్నారు. మధ్యాహ్నాం 3.00గంలరే మినకచాలగూడ, 4.00 గంటలకు ఆలేరు,సాయంత్రం 5.00గంటలకు ఉప్పల్, రాత్రి 7.00గంటలకు ఎల్బీనగర్ లలో రోడ్ షోలలో పాల్గొననున్నారు.