SSC Recruitment : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్ ఉద్యోగాల భర్తీ

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్‌ స్టూడెంట్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

SSC Recruitment : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ సీజీఎల్ ఉద్యోగాల భర్తీ

Staff Selection Commission CGL Jobs Recruitment

Updated On : September 18, 2022 / 3:31 PM IST

SSC Recruitment : స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 20,000 పోస్టులను కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌-2022 ద్వారా భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్,సార్టింగ్ అసిస్టెంట్, అసిస్టెంట్, ఎస్ఐ, టాక్స్ అసిస్టెంట్ సి, యూడీసీ, అసిస్టెంట్, అకౌంటెంట్, ఆడిటర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జెఎస్ ఓ), ఇన్‌స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/అప్పర్ డివిజన్ క్లర్క్‌, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్‌ స్టూడెంట్స్‌ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారుల వయసు గ్రూప్ సీ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్‌ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.29,200ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 8, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ssc.nic.in/ పరిశీలించగలరు.