SSC MTS Notification 2025: పదో తరగతి పాసయ్యారా? 11,908 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ రిక్రూట్‌మెంట్!

SSC MTS Notification 2025: స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్థిరపడాలనుకునే వారికి అవకాశాన్ని కల్పించనుంది.

SSC MTS Notification 2025: పదో తరగతి పాసయ్యారా? 11,908 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు బంపర్ రిక్రూట్‌మెంట్!

SSC MTS Notification 2025 Released

Updated On : June 27, 2025 / 12:47 PM IST

నిరుద్యోగులకు శుభవార్త. స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో స్థిరపడాలనుకునే వారికి అవకాశాన్ని కల్పించనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,908 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS), హవల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 24, 2025 లోపు అధికారిక వెబ్ సైట్ ssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

విభాగాల వారీగా పోస్టుల సంఖ్య

  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS): 10,210
  • హవల్దార్ (CBIC & CBN): 1,698

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?

విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుండి కనీసం పదో తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి: MTS, హవల్దార్ (CBN) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. హవల్దార్ (CBIC) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST, OBC అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. పేపర్-1 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), పేపర్-2 (డెస్క్రిప్టివ్) ఉంటుంది. హవల్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు శారీరక దారుఢ్య పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం ఎలా?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ ssc.gov.in లోకి వెళ్ళాలి.
  • కొత్త యూజర్ అయితే ‘New User? Register Now’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • ప్రాథమిక వివరాలతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
  • ఇప్పుడు మీ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
  • తరువాత లేటెస్ట్ నోటిఫికేషన్స్ టాబ్ లో Multi-Tasking (Non-Technical) Staff, and Havaldar Examination, 2025′ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • తరువాత Apply బటన్ పై క్లిక్ చేయాలి.
  • వ్యక్తిగత, విద్యార్హత వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయాలి.
  • సూచించిన ఫార్మాట్ లో ఫొటో, డిజిటల్ సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
  • ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఫీజు చెల్లించాలి.
  • తరువాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

  • జూన్ 26, 2025న నోటిఫికేషన్ విడుదల
  • జూన్ 26, 2025 నుంచి దరఖాస్తుల ప్రారంభం
  • జూలై 24 దరఖాస్తుకు చివరి తేదీ
  • సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 24, 2025 వరకు పరీక్షలు (పేపర్-1) జరుగుతాయి.