Study Abroad: విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ ఆఫర్.. రూ. 22 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌ పొందొచ్చు!

Study Abroad : 2024-25 విద్యా సంవత్సరం నుంచి విదేశాల్లోని యూనివర్శిటీల్లో తమ విద్యా ప్రయాణాన్ని ప్రారంభించే విద్యార్థులు ఈ గ్రాంట్‌కు అర్హత పొందుతారు.

Study Abroad: విదేశాల్లో చదివే విద్యార్థుల కోసం ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ ఆఫర్.. రూ. 22 లక్షల విలువైన స్కాలర్‌షిప్‌ పొందొచ్చు!

Study Abroad: This Australian University Offers Scholarship Worth Rs. 22 Lakh

Study Abroad : విదేశాల్లో చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ఇదే సరైన అవకాశం. ఆస్ట్రేలియాలోని సిడ్నీలోని పబ్లిక్ రీసెర్చ్ యూనివర్శిటీ అయిన మాక్వేరీ యూనివర్సిటీలో నాలుగు ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది.

ఇందులో ప్రతిభావంతులైన విద్యార్థులకు 40వేల డాలర్లు (సుమారు రూ. 22 లక్షలు) విలువైన స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ (mq.edu.au)లో తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి యూనివర్శిటీలో తమ విద్యను ప్రారంభించే విద్యార్థులు ఈ గ్రాంట్‌కు అర్హత పొందుతారు.

మాక్వేరీ యూనివర్సిటీ స్కాలర్‌షిప్ అర్హత ప్రమాణాలు :

  • ఈ గ్రాంట్‌కు అర్హత పొందడానికి, విద్యార్థి తప్పనిసరిగా యూనివర్సిటీ క్యాంపస్‌లో అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో చేరిన ఫుల్ టైమ్ అంతర్జాతీయ విద్యార్థిగా ఉండాలి.
  • భారత్ లేదా శ్రీలంక పౌరసత్వాన్ని కలిగి ఉండాలి.
  • మాక్వేరీ యూనివర్శిటీ నుంచి అడ్మిషన్ ధృవీకరించిన ఆఫర్‌ను కలిగి ఉండాలి.
  • ఆఫర్ లెటర్‌లో పేర్కొన్న నిర్దిష్ట గడువు తేదీలోగా ప్రారంభ రుసుమును చెల్లించాలి.
  • మాక్వేరీస్ సిడ్నీ క్యాంపస్‌లో అందించే అన్ని కోర్సుల డిగ్రీ ప్రోగ్రామ్‌ల కోసం ట్యూషన్ ఫీజులను కవర్ చేయడానికి స్కాలర్‌షిప్ వార్షిక 10వేల డాలర్లు (సుమారు రూ. 5.50 లక్షలు) స్టైఫండ్‌గా అందిస్తారు.

నాలుగు ఏళ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో రిజిస్టర్ చేసుకున్న విద్యార్థికి 4 ఏళ్ల కాలంలో 40వేల డాలర్ల వరకు స్కాలర్‌షిప్ అందుకుంటారు. వారి మొత్తం ట్యూషన్ ఫీజు నుంచి తొలగిస్తారు. మాక్వేరీ యూనివర్శిటీలోని ప్రధాన విద్యా విభాగాలు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (ఫిన్‌టెక్, ఎన్విరాన్‌మెంటల్ ఫైనాన్స్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్), డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఓటీ, ఏఐ, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, నెట్‌వర్కింగ్, సైబర్ సెక్యూరిటీ), ఇంజనీరింగ్ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మెకాట్రానిక్స్, రెన్యూవబుల్, ఎనర్జీ, సివిల్, కన్స్ట్రక్షన్, సాఫ్ట్‌వేర్), బిజినెస్ అనలిటిక్స్, మేనేజ్‌మెంట్, మెడిసిన్, ఆర్ట్స్, మీడియా కమ్యూనికేషన్స్ ఉంటాయి.

Read Also : Infinix 40 Pro 5G Launch : ఈ నెల 12న భారత్‌కు ఇన్ఫినిక్స్ 40 ప్రో 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?