గ్రామవీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులతో పాఠాలు..ఇక స్మార్ట్ ఫోన్ ఎందుకు?

  • Published By: nagamani ,Published On : October 3, 2020 / 02:43 PM IST
గ్రామవీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులతో పాఠాలు..ఇక స్మార్ట్ ఫోన్ ఎందుకు?

Updated On : October 3, 2020 / 3:16 PM IST

Teachers in Jharkhand’s Dumka turn village into classroom : గ్రామం వీధులే స్కూళ్లు..ఇంటి గోడలే బ్లాక్ బోర్డులు..మైకులు చేతబట్టి పాఠాలు చెబుతున్న టీచర్లు. లాక్ డౌన్ ముగిసినా..పాఠాలు చెప్పే తమకు..చదువుకునే విద్యార్ధులకు కూడా కరోనా కష్టం రాకుండా జాగ్రత్త పడుతూ ఇలా వినూత్నంగా పాఠాలు చెబుతున్నారు జార్ఖండ్‌లోని ధుమ్కా జిల్లాలోని ఓ గ్రామంలో టీచర్లు. స్మార్ట్ ఫోన్ లు ఎందుకు..డిఫరెంట్ ఐడియాలుండగా అంటున్నారు.


కరోనా కాలంలో చదువులు ఎలా మారిపోయాయంటే..చెట్లెక్కి పాఠాలు చెప్పే టీచర్ల పాట్లు..ఫోన్ల్ సిగ్నల్స్ రాక..అసలు స్మార్ట్ ఫోన్ కొనుకునే స్థోమత లేక కొంతమంది విద్యార్ధుల కష్టాలు. వెరసి విద్యార్ధుల చదువులు చట్టుబండలవుతున్నాయి. రేపటి పౌరుల భవితను ప్రశ్నార్థం చేస్తున్నాయి. కరోనా కారణంగా స్కూళ్లు అన్ని మూతబడటంతో విద్యార్ధుల చదువులు వానాకాలం చదువులకంటే దారుణంగా మారాయి. కానీ..చాలామంది టీచర్లు వినూత్నంగా ఆలోచిస్తు పిల్లలకు చదువులు అందేలా చేస్తున్నారు.


గ్రామంలోని దేవాలయాల్లోను…గ్రామపంచాయితీ ఆఫీసుల్లోను ఉండే మైకులతో కొంతమంది టీచర్లు పాఠాలు చెబుతుంటే జార్ఖండ్‌లోని ధుమ్కా జిల్లాలోని ఓ గ్రామంలో ఇంటి వీధుల్లోని అరుగులపై పిల్లల్ని సామాజిక దూరం పాటిస్తూ కూర్చోబెట్టారు. వీధుల్నే స్కూల్ గా మార్చేశారు. పిల్లలకు ఇంటి గోడలే బ్లాక్ బోర్డులుగా మార్చేశారు. మైకులు పట్టుకుని పాఠాలు చెబుతున్నారు. పిల్లల చదువుల కోసం పెద్దలు స్మార్ట్ ఫోన్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా చదువులు చెబుతున్నారు.


ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా ప్రభావంతో చదువులు కష్టంగా మారాయి. అంతా ఆన్ లైన్ చదువుకు కావటంతో వాటిని పిల్లలు అందుకోలేకపోతున్నారుప కారణం..స్మార్ట్ ఫోన్ కొని పిల్లలు అందించలేని పేదరికం. అందుకే విద్యార్ధులు చదువులో వెనకబడిపోకుండా ఉండటానికి టీచర్లు ఇలా వీధి అరుగులపై విద్యార్దులను కూర్చోపెట్టి వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టి..శభాష్ అనిపించుకుంటున్నారు.


గ్రామంలోని వీధులు స్కూలుగా.. ప్రతి ఇంటి గోడకు బ్లాక్ బోర్డును ఏర్పాటు చేసి విద్యార్థులను దూరం దూరంగా సామాజిక దూరం పాటించేలా కూర్చోబెట్టారు. కరోనా భయం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ..విద్యార్ధులంతా మాస్కులు పెట్టుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వారు కూడా మాస్కులు పెట్టుకుని మైక్ సాయంతో పాఠాలు చెబుతున్నారు.


దీంతో బడికివెళ్లాల్సిన పని లేకుండానే ఎవరి ఇంటి బయటే వరండాలో వాళ్లే హాయిగా చదువుకుంటున్నారు. విద్యార్థుల సమస్యలను కూడా స్పీకర్ ద్వారానే వినిపిస్తున్నారు. టీచర్లు ఇలా వినూత్నంగా పిల్లలకు చదువులు చెబుతుండటం చూసి గ్రామస్థులంతా అభినందిస్తున్నారు. విద్యార్థులు కూడా ఉత్సాహంగా ఆసక్తిగా చదువుకుంటున్నారు. దీంతో ఎవరికీ కరోనా అనే భయం ఉండదని, స్మార్ట్ ఫోన్ కొనాల్సిన పని కూడా లేదని టీచర్లు చెబుతున్నారు.