TG CPGET 2025: టీజీ సీపీగెట్ కీలక అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు, పూర్తి వివరాలు

TG CPGET 2025: తెలంగాణ సీపీగెట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేశారు.

TG CPGET 2025: టీజీ సీపీగెట్ కీలక అప్డేట్.. హాల్ టికెట్లు విడుదల.. పరీక్ష తేదీలు, పూర్తి వివరాలు

Telangana CPGET 2025 Entrance Exam Hall Tickets Released

Updated On : August 1, 2025 / 10:04 AM IST

తెలంగాణ సీపీగెట్ కీలక అప్డేట్ ఇచ్చింది. ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించిన హాల్ టికెట్లను విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

మీ హాల్ టికెట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://cpget.tgche.ac.in/ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో హాల్ టికెట్ డౌన్లోడ్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, ఎగ్జామ్ పేపర్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
  • తరువాత డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
  • మీ హాల్ టికెట్ డిస్ప్లే అవుతుంది
  • దానిని ప్రింట్/డౌన్లోడ్ చేసుకోవాలి.

పరీక్షా వివరాలు:

తెలంగాణ సీపీగెట్ – 2025 పరీక్షలు ఆగస్టు 4వ తేదీ నుంచి మొదలుకానున్నాయి. ఆగస్టు 11వ తేదీతో ముగుస్తాయి. ప్రతి రోజూ 3 సెషన్ల చొప్పున ఈ పరీక్షలు జరుగనున్నాయి. మొత్తం 45 సబ్జెక్టులకు గాను ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరుగనున్నాయి. సబ్జెక్టుల వారీగా తేదీల వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ https://cpget.tsche.ac.in/ నుంచి తెలుసుకోవచ్చు.