ఇంటర్ ఉత్తీర్ణుల మార్కుల పరిశీలన కేంద్రాలు..ఇవే..

ఇంటర్ మీడియట్ రగడ కొనసాగుతోంది. దీనిని తెరదించడానికి తెలంగాణ సర్కార్ రంగంలోకి దిగింది. మార్కుల పున:పరిశీలన, లెక్కింపు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనితో అధికారులు ఏర్పాట్లు చేశారు. వీటి కోసం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌లో 8 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఇంటర్ మీడియట్ బోర్డు వెబ్ సైట్ bie.telangana.gov.in లేదా TS ఆన్ లైన్ కేంద్రాలు లేదా ప్రత్యేక కేంద్రాల్లో పున:పరిశీలనకు రూ. 600, లెక్కింపు కోసం రూ. 100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఇంటర్ బోర్డు అధికారులు సూచించారు.
ఇవీ కేంద్రాలు :
– హైదరాబాద్ జిల్లా : –
* మహబూబియా జూనియర్ కళాశాల.
* ఎం.ఎ.ఎం జూనియర్ కళాశాల, నాంపల్లి
* ప్రభుత్వ జూనియర్ కళాశాల, కాచిగూడ
* ప్రభుత్వం బాలుర జూనియర్ కళాశాల, ఫలక్ నుమా
– రంగారెడ్డి జిల్లా : –
* ప్రభుత్వ జూనియర్ కళాశాల, హయత్ నగర్
* ప్రభుత్వ జూనియర్ కళాశాల, శంషాబాద్
– మేడ్చల్ జిల్లా : –
* జిల్లా విద్యాధికారి కార్యాలయం, మేడ్చల్
* ప్రభుత్వ జూనియర్ కళాశాల, కూకట్ పల్లి
— ఇదిలా ఉంటే ఇంటర్ జవాబు పత్రాల పున:పరిశీలనకు ఈసారి దరఖాస్తులు వెల్లువెత్తాయి. మరో మూడు రోజులు దరఖాస్తుకు గడువు ఉండగా..ఏప్రిల్ 24వ తేదీ బుధవారం నాటికి 50 వేల దరఖాస్తులు అందాయని ఇంటర్ బోర్డు వెల్లడించింది. గత ఏడాది పున:లెక్కింపునకు 3 వేల 236, పున:పరిశీలనకు 17 వేల 491 దరఖాస్తులు మాత్రమే అందాయని తెలిపింది.