Telugu » Education-and-job » Telangana Lawcet 2025 Counseling First Phase Registration Started Sn
TG LAWCET 2025: తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్ అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్.. ఒక్క క్లిక్ తో రిజల్ట్స్, ముఖ్య తేదీలు, పూర్తి వివరాలు తెలుసుకోండి
TG LAWCET 2025: తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Telangana LawCET 2025 Counseling First Phase Registration Started
తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ – 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలయ్యింది. లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సిలింగ్ ప్రక్రియకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలవగా ఆగస్ట్ 14వ తేదీ వరకు కొనసాగనుంది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా వారికీ సీట్లను కేటాయిస్తారు అధికారులు.
టీజీ లాసెట్ కౌన్సెలింగ్ ముఖ్యమైన తేదీలు, వివరాలు:
ఆగస్టు 4వ తేదీ నుంచి 14 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఉంటుంది.
ఆగస్టు 21, 22 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి.
ఆగస్టు 23వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది.
ఆగస్టు 28వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ఆగస్టు 29వ తేదీ నుంచి సెప్టెంబర్ 2వరకు విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి.
రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
హోం పేజీలో డౌన్లోడ్ ర్యాంక్ కార్డు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
అక్కడ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
వ్యూ ర్యాంక్ కార్డ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
ఫలితం స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి
దానిని ప్రింట్/డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
ఇక ఈ ఏడాది తెలంగాణ లాసెట్ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 45,609 మంది హాజరయ్యారు. టీజీ లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే 9908021100, 7207341100 నెంబర్లను సంప్రదించవచ్చు.