Telangana LawCET 2025 Counseling Schedule Released
తెలంగాణ రాష్ట్రంలోని లా కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయించనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇవాళ(జులై 26) లాసెట్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలవుతుండగా.. ఆగస్టు 4 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రక్రియ ఆగస్టు 14వ తేదీ వరకు కొనసాగుతుంది. అనంతరం, ఆగస్టు 16, 17వ తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 18వ తేదీన వెబ్ ఆప్షన్ల ఎడిట్ ఆప్షన్, ఆగస్టు 22న సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇక ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన అభ్యర్థులకు ఆగస్టు 22న ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. అవకాశం ఆగస్టు 25 వరకు ఉంటుంది. రిపోర్టింగ్ చేయకపోతే కేటాయించిన సీట్ క్యాన్సిల్ అవుతుంది. వీరికి ఆగస్టు 30 నుంచి తరగతులు మొదలవుతాయి.
ఇక ఈ ఏడాది తెలంగాణ లాసెట్ పరీక్షకు మొత్తం 57,715 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 45,609 మంది మాత్రమే హాజరయ్యారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సు కోసం 32,118 మంది, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల కోసం 13,491 మంది అభ్యర్థులు పరిక్ష రాశారు. వీరిలో ఉత్తీర్ణత సాధించిన వారు వారి వారి ర్యాంక్ ల ఆధారంగా సీట్లు పొందుతారు.