పదో తరగతి పరీక్ష హాల్ టికెట్స్ రిలీజ్

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 09:22 AM IST
పదో తరగతి పరీక్ష హాల్ టికెట్స్ రిలీజ్

Updated On : March 13, 2020 / 9:22 AM IST

తెలంగాణాలో మార్చి 19, 2020 నుంచి జరగబోయే పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆన్ లైన్ విధానంలో…. హాల్ టికెట్లను రిలీజ్ చేసింది. విద్యార్దులు అధికారికక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

విద్యార్ధులు హాల్ టికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవటానికి bse.telangana.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేసి ఎడమ వైపు ఉన్న S.S.C MARCH – 2020 Hall Tickets Download లింక్‌పై క్లిక్ చేయాలి. తరువాత రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ప్రయివేట్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, ఓఎస్సెస్సీ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్, వొకేషనల్ హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. తరువాత జిల్లా పేరు, స్కూల్ పేరు, పుట్టిన తేదీ ఎంటర్‌చేసి హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 

పదో‌తరగతి పరీక్షలు మార్చి 19, 2020 నుంచి ప్రారంభమై ఏప్రిల్ 6, 2020 ముగియనున్నాయి. ప్రతి‌రోజు ఉదయం 9.30గంటలకు పరీక్ష ప్రారంభమై, మధ్యాహ్నం 12.15 గంటల వరకు జరుగుతాయి. ద్వితీయ‌భాష పరీక్ష, ఓఎస్ఎస్‌సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ – 1, పేపర్ -2 పరీక్షలు మాత్రం ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు, కాంపోజిట్ కోర్సు ప్రథమ భాష పేపర్ – 2 పరీక్ష 10.45 గంటల వరకు, ఎస్ఎస్‌సీ ఒకేషనల్ కోర్సు పరీక్ష 11.30 గంటల వరకు జరుగుతాయి. విద్యార్ధులకు ఆఖరి అరగంట ముందు మాత్రమే ఆబ్జేక్టివ్ పేపర్ ని ఇస్తారు.

Also Read | రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని TRS MP నామా డిమాండ్