చదువుపై ఇష్టం : 15 ఏళ్లకు పెళ్లి..19 ఏళ్లకు 12వ తరగతి ఎగ్జామ్స్ లో టాప్ ప్లేస్

  • Publish Date - August 2, 2020 / 08:03 AM IST

ఆమెకు చదువు అంటే ఎంతో ఇష్టం. 12వ తరగతి పరీక్షల్లో ఎలాగైనా పాస్ కావాలని లక్ష్యం పెట్టుకుంది. అనుకున్నట్లుగానే సాధించింది. ఇందులో విశేషం ఏమిటని అనుకుంటున్నారు కదు.. అవును ఆమె ఓ తల్లి. కుమారుడి, ఇంట్లో అత్తమామ, భర్త, ఇంటి పనులు చేస్తూనే ఆమె చదువుకుంది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ..ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి..అని ఈ ఘటన నిరూపిస్తోంది.



త్రిపుర..రాజధాని ఆగర్తలకు సమీపంలో ఉన్న గాంధీ గ్రామ్ టౌన్ లో సంఘ మిత్రా దేబ్ కు 15 ఏళ్లకే వివాహం జరిగింది. ఈమె భర్త రాజు ఘోష్. ఇతను బీఎస్ఎఫ్ లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. కొంచెం ఊహ తెలిసిన విషయంలో..వివాహం జరగడంతో చదువుకు ఫుల్ స్టాప్ పెట్టాల్సి వచ్చింది. వివాహం జరగడం, అత్తింటిలో బాధ్యతలు చూసుకోవడం జరిగిపోయాయి.

అప్పటికే ఆమె తల్లి అయిపోయింది. ఇంకా బాధ్యతలు పెరిగిపోయాయి. కానీ..మనస్సులో చదువుకోవాలనే కాంక్ష ఇంకా ఉంది. అనుకున్నట్లుగానే…12వ తరగతి పరీక్షకు ప్రిపేర్ అయ్యింది. ఇందుకు అత్తమామలు సహకరించారు. శుక్రవారం Tripura Board of Secondary Education బోర్డు ఫలితాలను విడుదల చేసింది.



అందులో రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆర్ట్స్ గ్రూపులో రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు. ర్యాంకు సాధించడం పట్ల..సంతోషం వ్యక్తం చేసింది. ఇంటి పని, పిల్లాడి పనులు పూర్తి చేశాకే..తాను చదుకొనేదానినని, అత్తమామలు కూడా తనకు ఎంతో సహాయం చేశారని సంఘ మిత్రా దేబ్ తెలిపారు. ఈ ఫలితాలు తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయని, డిగ్రీ చదవడమే తన లక్ష్యమని వెల్లడించింది.