డోంట్ మిస్ : ఫిబ్రవరి 17 నుంచి గురుకుల సెట్ నోటిఫికేషన్లు

  • Published By: veegamteam ,Published On : February 12, 2019 / 05:30 AM IST
డోంట్ మిస్ : ఫిబ్రవరి 17 నుంచి గురుకుల సెట్ నోటిఫికేషన్లు

రాష్ట్రంలోని SC, ST, BC, సాధారణ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించే గురుకుల సెట్‌ పరీక్ష 2019, ఫిబ్రవరి 17న నిర్వహించే అవకాశాలున్నాయి. 50 వేల సీట్లను భర్తీ చేసేందుకు నిర్వహించే ఈ పరీక్షకు ప్రతీ సంవత్సరం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రాతపరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఆయా జిల్లాల పరిధిలోని గురుకులాల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ నెల 18 నుంచి మార్చి 10 వరకు దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తోంది. గురుకులాలతోపాటు సంక్షేమ భవన్‌లోనూ ప్రత్యేక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన చేస్తోంది.

 

2019-20 నుంచి కొత్తగా మరో 119 BC గురుకుల పాఠశాలలు రానున్నయి. BC సొసైటీల్లో సీట్ల సంఖ్య 20 వేలు దాటనుంది. కొత్తగా మరో 25 వరకు సాధారణ గురుకులాలు ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కొత్త పాఠశాలలు మంజూరైతే సాధారణ సొసైటీల్లో మరో 2 వేల సీట్లు అందుబాటులోకి వస్తాయి. ప్రతి పాఠశాలలో ఐదో తరగతిలో రెండు సెక్షన్ల కింద 80 సీట్లు భర్తీ చేయనున్నారు. ప్రవేశపరీక్ష తేదీని గురుకుల సెట్‌ – 2019 ప్రకటనతో లేదా తర్వాత వెల్లడించే అవకాశాలున్నాయి.

సొసైటీల వారీగా పాఠశాలల సీట్లు:
     సొసైటీ                పాఠశాలలు           సీట్ల సంఖ్య  
సాంఘీక సంక్షేమం             232               18వేల 560
గిరిజన సంక్షేమం               88                  7,040
జనరల్                            35                  2,800
బీసీ                                142+119         20వేల 800