TS Polycet-2024 Notification : తెలంగాణ పాలిసెట్‌ 2024 నోటిఫికేషన్‌.. ఈరోజు నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు.. పరీక్ష ఎప్పుడంటే?

TS Polycet-2024 Notification : తెలంగాణ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్థులు పాలిసెట్ రాత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 (ఈరోజు) నుంచే పాలిసెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

TS Polycet-2024 Notification Released, Exam On May 17

TS Polycet-2024 Notification : టీఎస్ పాలిసెట్-2024 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ (తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి, హైదరాబాద్) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి, ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్, టెక్నాలజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశాల కోసం పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించనుంది. పదో తరగతి (SSC) లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, ప్రస్తుతం 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు పాలిసెట్ రాత పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 15 (ఈరోజు) నుంచే పాలిసెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.

పాలిసెట్ పరీక్ష దరఖాస్తు చివరి తేదీ, ఆలస్య రుసుము వివరాలివే :
ఈ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 22గా నిర్ణయించింది. అయితే, పాలిసెట్ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకునే వారిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 250 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇతర (జనరల్) అభ్యర్థులు రూ. 500 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 22 చివరి తేదీ తర్వాత దరఖాస్తు చేసుకుంటే.. రూ.100 ఆలస్య రుసుము (ఏప్రిల్ 24 లోపు) చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ 26లోపు దరఖాస్తు చేసుకుంటే ఆలస్య రుసుము రూ. 300 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత మే 17న పాలీసెట్ రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష ముగిసిన 12 రోజుల్లో పాలిసెట్ ఫలితాలు వెల్లడిస్తారు. మరిన్ని వివరాల కోసం పాలిసెట్ అధికారిక వెబ్‌సైట్ https://polycet.sbtet.telangana.gov.in/ సందర్శించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Read Also : UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసు పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

షెడ్యూల్ ప్రకారం.. 2024-25 పాలిసెట్ ప్రవేశ పరీక్షను పీవీ నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం (PVNRTVU) ద్వారా నిర్వహించనుంది. పశుసంవర్థనం, మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు, కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (PJTSAU) అందిస్తున్న వ్యవసాయ కోర్సులకు కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

టీఎస్ పాలిసెట్ 2024 పరీక్ష తేదీ : మే 17, 2024

  • దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి.
  • అడ్మిషన్ల కోసం దరఖాస్తుదారులు polycet.sbtet.telangana.gov.in విజిట్ చేయొచ్చు.
  • టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు.
  • SSC పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు టీఎస్ పాలిసెట్-2024 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • దరఖాస్తుకు చివరి తేదీ : ఏప్రిల్ 22, 2024
  • ఏప్రిల్ 24లోపు ఆలస్య రుసుము : రూ. 100
  • ఏప్రిల్ 26 లోపు ఆలస్య రుసుము : రూ. 300

టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ప్రక్రియ ఇలా :

  • టీఎస్ పాలిసెట్ దరఖాస్తు ఫారమ్ ప్రక్రియలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  • దరఖాస్తులో అవసరమైన వివరాలను నింపాలి. డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. ఆపై చెల్లింపు ఉంటుంది.
  • టీఎస్ పాలిసెట్ 2024 దరఖాస్తు ఫారమ్‌ ఒకటికి మించి అప్లయ్ చేయకూడదు.
  • దరఖాస్తు ఫారమ్ పూరించే ముందు అన్ని డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి.
  • టీఎస్ పాలిసెట్ 2024 దరఖాస్తు ఫారమ్ ఆన్‌లైన్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

టీఎస్ పాలిసెట్ పరీక్షా విధానం ఇలా : 

  • రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు టీఎస్ పాలిసెట్ అడ్మిట్ కార్డ్ ఆన్‌లైన్‌లో జారీ అవుతుంది.
  • టీఎస్ పాలిసెట్ అధికారిక వివిధ పరీక్షా కేంద్రాలలో ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహిస్తారు.
  • ఈ పాలిసెట్ పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాల వ్యవధి ఉంటుంది.
  • పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు అడ్మిట్ కార్డ్‌తో పాటు వ్యాలీడ్ ఫొటో ఐడీ ప్రూఫ్ వెంట తీసుకెళ్లాలి
  • పరీక్ష జరిగిన కొన్ని రోజుల తర్వాత (TS POLYCET 2024) ఆన్సర్ కీని విడుదల చేస్తుంది.
  • ఆన్సర్ కీలో అభ్యంతరాలు తెలిపేందుకు దరఖాస్తుదారులకు అనుమతిస్తారు.
  • అన్ని అభ్యంతరాలను సమీక్షించిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీతో పాటు టీఎస్ పాలిసెట్ ఫలితాలను విడుదల చేస్తారు.

Read Also : CBSE Board Exam 2024 : రైతుల నిరసన మధ్య 10, 12వ తరగతి బోర్డ్ పరీక్షలు.. విద్యార్థులకు సీబీఎస్ఈ కీలక సూచనలివే..!

ట్రెండింగ్ వార్తలు