TS PolyCET 2025: తెలంగాణ పాలిసెట్ కీలక అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్

TS PolyCET 2025: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగినట్టు పరకటించారు.

TS PolyCET 2025: తెలంగాణ పాలిసెట్ కీలక అప్డేట్.. ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు.. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే సీట్ క్యాన్సిల్

TS Polycet 2025 First Phase Seat allotment completed

Updated On : July 15, 2025 / 10:11 AM IST

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఇటీవలే మొదలైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా కీలక ప్రకటన చేశారు అధికారులు. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగినట్టు పరకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ https://tgpolycet.nic.in/cand_signin.aspx నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జులై 18లోపు తమకు కేటాయించిన కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. గడువులోగా రిపోర్టింగ్ చేసుకోకపోతే సీట్ క్యాన్సిల్ అవుతుంది.

మీ అలాట్‌మెంట్‌ ఆర్డర్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్ సైట్ https://tgpolycet.nic.in/Default.aspx లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో క్యాండెట్ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా సేవ్ చేసుకోవాలి.

ఇక పాలిసెట్-2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 23 నుంచి మొదలుకానుంది. మొదట జూలై 24 నుంచి 25 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది. జూలై 25వ తేదీలోపు సీట్లు కేటాయింపు జరుగుతుంది. జూలై 31 నుంచి ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి.