తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ : ఉత్తీర్ణత 92.43శాతం, బాలికలే టాప్

  • Publish Date - May 13, 2019 / 06:15 AM IST

తెలంగాణ రాష్ట్రం 10వ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఎప్పటిలాగానే బాలికలే పై చేయి సాధించారు. మొత్తం 92.43 ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను 2019, మే 13వ తేదీ సోమవారం విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి విడుదల చేశారు. బాలురు 91.18 శాతం, బాలికలు 93.68 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాల్లో జగిత్యాల జిల్లా మొదటి స్థానం నిలవగా హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది. సిద్ధిపేట రెండో స్థానం, కరీంనగర్ మూడో స్థానంలో నిలిచింది. 10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదు కోసం ప్రత్యేక యాప్ రూపొందించినట్లు వెల్లడించారు.  

సబ్జెక్టుల వారీగా : –
–  మొదటి భాషలో 98.73, ద్వితీయ భాషలో 99.83శాతం, తృతీయ భాషలో 98.75 శాతం, గణితంలో 96.13 శాతం,  సామాన్య శాస్త్రంలో 98.88 శాతం, సాంఘీక శాస్త్రంలో 99.05 శాతం, గణితంలో 98.75 శాతం పాస్ అయ్యారన్నారు. 

ఫలితాల కోసం https://www.bse.telangana.gov.in/ వెబ్ సైట్‌లో ఫలితాలు చూడొచ్చు.

మేనేజ్ మెంట్ వారీగా : –
బీసీ వెల్ఫేర్ 98.78 శాతంతో టాప్‌లో నిలిచింది. 
గవర్న‌మెంట్ రెసిడెన్షియల్ స్కూళ్లలో 98.54 శాతంతో రెండో స్థానంలో ఉంది. 
మోడల్ స్కూళ్లలో 15 వేల 434 అందులో 98.45 శాతం పాస్ అయ్యారు. 
11 వేల 026 స్కూళ్లలో 4 వేల 374 స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. 
15 వందల 80 జిల్లా పరిషత్ స్కూళ్లలో వంద శాతం ఫలితాలు వచ్చాయి. 
5 వేల ప్రైవేటు స్కూళ్లలో 2 వేల 279 స్కూళ్లలో నూటికి నూరు శాతం ఫలితలు వచ్చాయి. 

అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జూన్ 10వ తేదీ 24వ జూన్ వరకు నిర్వహిస్తారు. 
మే 27వ తేదీ చివరి తేదీ. 
SBI చలాన్ల ద్వారా ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్ మే 29. 

10వ తరగతి పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు జరిగాయి.
టెన్త్ పరీక్షలకు 5 లక్షల 52 వేల 280 మంది విద్యార్థులున్నారు. 
5 లక్షల 46 వేల 728 మంది విద్యార్థులు హాజరయ్యారు.
5 లక్షల 6 వేల 202 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
9 స్కూళ్లల్లో సున్నా ఉత్తీర్ణత శాతం నమోదైంది. 

10వ తరగతి ఫలితాలపై ఫిర్యాదుల కోసం విద్యాశాఖ అధికారులు ప్రత్యేక యాప్‌ను అందుబాటులో ఉంది. TSSSC BOARD పేరుతో రూపొందించిన ఈ యాప్ ద్వారా పాఠాశాలల ప్రధానోపాధ్యాయులు ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చు. ఈ యాప్ గూగుల్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. bsetelangana.org, results.cgg.gov.in వెబ్‌సైట్లలో 10వ తరగతి ఫలితాలను చూసుకోవచ్చు విద్యార్ధులు.