Young Professionals Recruitment : కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మిషన్ మోడల్ ప్రాజెక్ట్‌లో ఒప్పంద ఖాళీల భర్తీ
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, సోషల్ వర్క్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ,పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Union Ministry of Labor and Employment Mission Model Project to fill contractual vacancies
Young Professionals Recruitment : కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ మిషన్ మోడల్ ప్రాజెక్ట్ కింద సౌత్ రీజియన్‌లోని మోడల్ కెరీర్ సెంటర్‌లలో ఒప్పంద ప్రాతిపదికన పలు ఖాళీలను భర్తీ చేనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఎకనామిక్స్, సైకాలజీ, సోషియాలజీ, ఆపరేషన్స్ రిసెర్చ్, స్టాటిస్టిక్స్, సోషల్ వర్క్, మేనేజ్‌మెంట్, ఫైనాన్స్, కామర్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ స్పెషలైజేషన్‌లో బీఏ, బీఈ, బీటెక్, బీఈడీ, ఎంబీఏ,పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.50,000ల చొప్పున జీతం చెల్లిస్తారు.
దరఖాస్తుదారుల వయసు 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైన 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు గడువు తేది తదితర వివరాలకోసం వెబ్ సైట్ ; https://labour.gov.in/circulars పరిశీలించగలరు.