UPSC Recruitment : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని నవంబర్ 11వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది.

Union Public Service Commission Recruitment for various job vacancies
UPSC Recruitment : భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 15 ఇన్విస్టిగేటర్ గ్రేడ్-1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. ఖాళీల వివరాలకు సంబంధించి ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ 1 ఖాళీ, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 2 ఖాళీలు, ఇన్వెస్టిగేటర్ గ్రేడ్-I పోస్టులు 12 ఖాళీలు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టిఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌నుంచి అగ్రికల్చర్/అగ్రికల్చరల్ఎక్స్‌టెన్షన్/బోటనీ/జువాలజీ/మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీ/ఫజికల్ ఆంత్రోపాలజీ/జెనెటిక్స్/ఫోరెన్సిక్ సైన్స్/కెమిస్ట్రీ స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, బీఈ/బీటెక్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధుల వయసు 30 ఏళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 10, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి చేసిన దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని నవంబర్ 11వ తేదీలోపు పోస్టు ద్వారా పంపించవల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.upsc.gov.in/ పరిశీలించగలరు.