EPFOలో 421 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!

  • Published By: veegamteam ,Published On : January 14, 2020 / 05:09 AM IST
EPFOలో 421 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే!

Updated On : January 14, 2020 / 5:09 AM IST

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేష‌న్ ‌(EPFO)లో ఉద్యోగాల భర్తీకి యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 45 ప్రధాన నగరాల్లో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

వయసు:
అభ్యర్థులు 30 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.   

ఎంపిక విధానం:
అభ్యర్థులను రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ, అనుభ‌వం ఆధారంగా ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష విధానం:
ఆఫ్‌లైన్ విధానంలో పరీక్ష ఉంటుంది. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష సమయం 2 గంటలు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 చొప్పున మార్కులు కోత విధిస్తారు.