UPSC లో అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) లో అసిస్టెంట్ ఇంజనీర్, మెడికల్ ఆఫీసర్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 134 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
విభాగాల వారీగా ఖాళీలు :
మెడికల్ ఆఫీసర్, రిసెర్చ్ ఆఫీసర్(ఆయుర్వేద) – 37
మెడికల్ ఆఫీసర్, రిసెర్చ్ ఆఫీసర్ (యూనాని) – 7
ఆంథ్రోపాలజిస్ట్ (కల్చరల్ ఆంథ్రోపాలజీ డివిజన్) – 1
అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (తమిళం) – 1
అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్మమెంట్(ఆమ్యూనిషన్) – 11
అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్ – 39
అసిస్టెంట్ ఇంజనీర్ ఆర్మమెంట్(వెపన్స్) – 14
అసిస్టెంట్ సివిల్ – 2
సైంటిస్ట్ – B(డాక్యుమెంట్స్) – 6
సైంటిస్ట్ – B(కెమిస్ట్రీ) -2
సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(న్యూరోసర్జరీ) – 4
సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(ప్లాస్టిక్ సర్జరీ) – 2
సీనియర్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్(యూరాలజీ) – 4
స్పెషలిస్ట్ గ్రేడ్3(గ్యాస్ట్రో ఎంటరాలజీ) – 1
స్పెషలిస్ట్ గ్రేడ్3(ప్లాస్టిక్ సర్జరీ అండ్ రీకన్ స్ట్రక్టివ్ సర్జరీ) – 3
విద్యార్హత : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగి ఉండాలి.
ఎంపికా విధానం : అభ్యర్దులను కంప్యూటర్ బేస్ టెస్ట, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్ధులకు రూ.25 చెల్లించాలి. SC,ST, దివ్యాంగులు, మహిళా అభ్యర్ధులకు మాత్రం ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : జనవరి 25, 2020.
దరఖాస్తు చివరి తేదీ : ఫిబ్రవరి 13, 2020.